Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ మీట్ రగడపై స్పందించిన బన్ని
By: Tupaki Desk | 14 Dec 2021 4:33 AM GMTతమ ఫేవరెట్ స్టార్ అల్లు అర్జున్ తో ఫోటోలు దిగాలన్న అభిమానుల కుతూహాలం పెద్ద గడబిడకు దారి తీసింది. పర్యవసానంగా పోలీసుల లాఠీ ఛార్జ్ లో కొందరికి గాయాలు అయ్యాయని మీడియాలో కథనాలొచ్చాయి. దీనిపై బన్ని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ తనకు అతిపెద్ద ఆస్తి అని .. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రామిస్ చేశారు.
ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్ప-ది రైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో తమ అభిమాన నటుడితో ఫోటోషూట్ అవకాశం అంటూ వార్త విన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్నారు. కానీ అల్లు అర్జున్ చాలాసేపటి వరకూ ఈవెంట్ కు రాకపోవడంతో కోపంగా ఉన్న కొందరు అభిమానులు ఎన్-కన్వెన్షన్ సెంటర్ పై రాళ్లు రువ్వారని.. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. పోలీసులు లాఠీచార్జి చేయడంతో కొందరు అభిమానులు గాయపడ్డారు. అనంతరం భారీ సంఖ్యలో అభిమానులు గీతా ఆర్ట్స్ కార్యాలయాన్ని కూడా సందర్శించారని ప్రచారమైంది. అయితే అదంతా నిజం కాదని అల్లు అర్జున్ బృందం స్పష్టం చేసింది. దీనిపై తాజాగా బన్ని ఓ అధికారిక ప్రకటన విడుదల చేశాడు.
``ఈరోజు జరిగిన ఫ్యాన్స్ మీట్ ఈవెంట్ లో నా అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నా బృందం పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తోంది. నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. మీ ప్రేమ అభిమానం నా అతిపెద్ద ఆస్తి`` అని అల్లు అర్జున్ అన్నారు. మరోవైపు ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు అనుమతించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులను పిలిచినందుకు పుష్ప నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప ఈనెల 17న దేశ విదేశాల్లో పలు భాషల్లో విడుదవుతోంది. రష్మిక మందన ఈ చిత్రంలో కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. భారీ హైప్ నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా వసూళ్లతో అదరగొడుతుందని అంచనా వేస్తున్నారు. బన్ని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా ఈ మూవీకోసం వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.
దారి మధ్యలోనే వెనుదిరిగిన బన్ని
మీట్ అండ్ గ్రీట్ లో జరిగిన గడబిడలో అభిమానులకు గాయాలయ్యాయన్న వార్త వినగానే అల్లు అర్జున్ ఆగ్రహించి వెంటనే ఈవెంట్ ను రద్దు చేసుకున్నారని తెలిసింది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం N కన్వెన్షన్ సెంటర్ లో చాలా మంది అత్యుత్సాహంగా ఉన్న అభిమానులు విపరీతంగా విరుచుకుపడి అల్లకల్లోలం సృష్టించారు. తర్వాత అల్లు అర్జున్ తన అభిమానుల కోసం ప్లాన్ చేసిన హై-ప్రొఫైల్ మీట్ అండ్ గ్రీట్ గందరగోళంగా మారింది. అభిమానులు పెద్ద ఎత్తున ప్రవేశ ద్వారం పగులగొట్టి ఎన్ కన్వెన్షన్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
తొక్కిసలాటలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురించి తెలియగానే ఈవెంట్ కు వెళుతున్న అల్లు అర్జున్ తీవ్ర కలత చెందారు. కోపంతో ఫోటో సెషన్ ను రద్దు చేసి తన ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ ఘటనకు ముందు కూడా అభిమానులు అల్లు అర్జున్ కారును అతని నివాసం వద్ద వెంబడించారు. నిన్న రాత్రి పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కూడా అభిమానులు అల్లు అర్జున్ ను కలవడానికి సెల్ఫీలు ఫోటోలు క్లిక్ చేయడానికి నానా హైరారా సృష్టించారు. వరుస సీక్వెన్సుల్లో ఫ్యాన్స్ కి గాయాలవ్వడం బన్నీని తీవ్రంగా బాధించింది.