Begin typing your search above and press return to search.
10 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిన బన్నీ!
By: Tupaki Desk | 11 Aug 2022 6:26 AM GMTఒక్క సక్సెస్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడతని రేంజ్ ఆకాశాన్నంటుతుంది. స్కైలో దూసుకుపోతున్నాడు. గత ఆరేడు..నెలలుగా ఎండార్స్ మెంట్స్ తో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. వాటి ద్వారానే కోట్ల రూపాయాల ఆదాయం సమకూరింది. సినిమాలు చేయకపోయినా? కమర్శియల్స్ తో నే రెట్టించిన ఆదాయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఇది బన్నీకి మాత్రమే తెలిసిన టెక్నిక్ గా దూసుకుపోతున్నాడు.' పుష్ప -2' సైతం వాయిదా పడుతుందంటే? బన్నీ బిజీ షెడ్యూల్ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. అయితే ఇలా ఎంత సంపాదించినా? అంతా ఓ పద్దతిగా ఉండాలి. నలుగురికి ఆదర్శంగానే ఉండాలి తప్ప కోట్లు వచ్చి పడుతున్నాయని ప్రతీ యాడ్ లోనూ నటించడానికి బన్నీ సిద్దంగా ఉండడు అని ఇప్పటికే ప్రూవ్ అయింది.
ఆ మధ్య ఓ గుట్కా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే కోట్ల రూపాయాల పారితోషికం చెల్లిస్తామని సదరు బ్రాండ్ బన్నీని అప్రోచ్ అయింది. కానీ ఆ ఆఫర్ ని బన్నీ సున్నితంగా తిరస్కరించాడు. అలాంటి యాడ్స్ చేయబోనని చెప్పకనే చెప్పాడు. తాజాగా బన్నీ పాన్ ఇండియా క్రేజ్ చూసి ఓ బ్రాండెడ్ ఆల్కాహాల్ కంపెనీ బన్నీని అప్రోచ్ అయింది.
తమ బ్రాండ్ బీర్ ని ప్రమోట్ చేస్తే సింగిల్ పేమెంట్ 10 కోట్లు ఒకే సారి చెల్లిస్తామని ఆఫర్ చేసింది. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్? అకౌంట్ నెంబర్ చెప్పండి..ఓటీపీ ఎంటర్ చేసి ట్రాన్సఫర్ చేస్తామని టెంప్ట్ చేసారు. కానీ బన్నీ మాత్రం ఇంచు కూడా తన ఆలోచనలో మార్పు తీసుకురాలేదు.
10 కాదు 20 కోట్లు ఇచ్చినా కొన్ని కొన్ని పనులు చేయను గాక చేయను అని చెప్పి పంపిచేసాడు. దీంతో బన్నీ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ లో నిలిచాడు. అల్లు అర్జున్ #AA NO-1 అంటూ హ్యాష్ ట్యాగ్ ని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఇదే టాప్ లిక్కర్ బ్రాండ్ సర్రోగేట్ క్యాంపెయిన్ లో సమంత..ప్రియాంక చోప్రా..అలియాభట్ నటించారు.
వాళ్లు ముగ్గురు కేవలం నీరు మరియు గ్లాస్ కి సబంధించి మాత్రమే ప్రమోట్ చేసారు. నేరుగా లిక్కర్ బ్రాండ్ ని ప్రమోట్ చేయలేదు. ఇప్పుడా అవకాశం బన్నికిచ్చారు. కానీ ఆయన నో చెప్పేసారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ వేరే హీరోని అప్రోచ్ అయ్యే అవకాశం లేకపోలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలెవరు ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. అందులోనూ లిక్కర్ యాడ్స్..గుట్కా యాడ్స్ అంటే? ఎన్నికోట్లు ఆఫర్ చేసినా ఎవరూ ముందుకురారు.