Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ పై బ‌న్నీ షాకింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   26 March 2022 6:53 AM GMT
రామ్ చ‌ర‌ణ్ పై బ‌న్నీ షాకింగ్ కామెంట్స్‌
X
యావ‌త్ దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూసిన చిత్రం ట్రిపుల్ ఆర్‌. దాదాపు మూడున్న‌రేళ్లుగా ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వారి ఎదురుచూపులు ఫ‌లించి ట్రిపుల్ ఆర్ మార్చి 25న శుక్ర‌వారం భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రిలీజ్ కు ముందు రోజే ప్రీమియ‌ర్ లు ప‌డిపోవ‌డంతో సినిమా టాక్ బ‌య‌టికి వ‌చ్చేసింది. భార‌తీయ తెల‌ర‌పై రాజ‌మౌళి మ‌రో అద్భుతాన్ని సృష్టించారంటూ అంతా ప్ర‌శంస‌లు కురిపించ‌డం మొద‌లైంది.

ఇంత వ‌ర‌కు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయి హ‌డావిడి జ‌ర‌గ‌లేదు. ఈ స్థాయి స్క్రీన్ ల‌లో ఏ మూవీ విడుద‌ల కాలేదు. అంతలా హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఈమూవీపై ఇప్ప‌డు ప్ర‌శంస‌లు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. మెగా స్టార్ యిరంజీవి నుంచి ప్ర‌తీ ఒక్క‌రూ ట్రిపుల్ ఆర్ ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ప్ర‌తిభ‌ని కొనియాడుతున్నారు. తెలుగు సినిమాని మ‌రింత హైట్స్ కి తీసుకెళ్లార‌ని, ఇదొక అద్భుత‌మ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదిలా వుంటే తాజాగా ట్రిపుల్ ఆర్ ని ప్ర‌త్యేకంగా వీక్షించిన పుష్ప‌రాజ్ అల్లు అర్జున్ ట్రిపుల్ ఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌తో పాటు అజ‌య్ దేవ్ గ‌న్‌, అలియాభ‌ట్‌, కీర‌వాణి, డీఓపీ సెంథిల్ కుమార్ ఇలా ప్ర‌తీ ఒక్క‌రినీ ప్ర‌త్యేకంగా అభినందిస్తూ శ‌నివారం ట్వీట్ చేశారు. మ‌రీ ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ని బావ అంటూ పొగ‌డ్త‌ల్లో ముంచేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌న్నీ ఇలా రామ్ చ‌ర‌ణ్ ని బావా అంటూ సంబోధించ‌డం ఇదే తొలిసారి.

సినిమాలో తార‌క్ షో చాలా అద్భుతంగా వుంద‌ని, అజ‌య్ దేవ‌గ‌న్ గారు క‌నిపించిన తీరు, ఆయ‌న పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు బ్రిలియంట్ అన్నారు. కీర‌వాణి, సెంథిల్ కుమార్‌, నిర్మాత దాన‌య్య‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల‌ని తెలిపిన బ‌న్నీ అంతా క‌లిసి బార‌తీయ సినిమా గ‌ర్వించేలా చేశారు. ట్రిపుల్ ఆర్ లు క‌లిసి సంయుక్తంగా చంపేశార‌ని ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా ట్రిపుల్ ఆర్ టీమ్ కి శుభాకాంక్ష‌లు తెలిపిన బ‌న్నీ ఇదొక అద్భుత‌మైన సినిమా అన్నారు. రాజ‌మౌళి మ‌న గ‌ర్వం, ఆయ‌న విజ‌న్ కి హ్యాట్సాఫ్‌.. నా బ్ర‌ద‌ర్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ప్ర‌ద‌ర్శించాడ‌ని, అత‌న్ని చూస్తే గ‌ర్వంగా వుంద‌ని, మా బావ ఓ ప‌వ‌ర్ హౌస్ అని బ‌న్నీ చ‌ర‌ణ్ పై త‌న ప్రేమ‌ని కురిపించాడు.

బ‌న్నీ ఇలా చ‌ర‌ణ్ ని బావా అంటూ సంబోధిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేయ‌డం ఇదే తొలి సారి కావ‌డంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. బ‌న్నీ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే బ‌న్నీ త్వ‌ర‌లో `పుష్ప 2` షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందు కోసం ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు సుకుమార్ అండ్ టీమ్ లొకేష‌న్స్ ని వెతికే ప‌నిలో వున్నారు.