Begin typing your search above and press return to search.

'పుష్ప 2' కు గాను బన్నీ స్పెషల్‌ రెమ్యూనరేషన్‌

By:  Tupaki Desk   |   2 Jun 2021 3:30 AM GMT
పుష్ప 2 కు గాను బన్నీ స్పెషల్‌ రెమ్యూనరేషన్‌
X
అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో సినిమా తో భారీ బ్లాక్‌ బస్టర్‌ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా సక్సెస్‌ తో తదుపరి సినిమా భారీ పారితోషికంను తీసుకుంటున్నాడనే వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం చేస్తున్న పుష్ప సినిమా వైకుంఠపురంలో పూర్తి అవ్వక ముందే కమిట్‌ అయ్యాడు. పారితోషికం విషయంలో కూడా అప్పుడే ఒప్పందం కుదిరింది. కనుక అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్‌ తాలూకు పారితోషికంను పుష్ప మొదటి పార్ట్‌ కు అందుకోవడం లేదు. కాని ఎప్పుడైతే రెండవ పార్ట్‌ చర్చలు మొదలు అయ్యాయో ఆయన పారితోషికం కూడా పెరిగింది.

పుష్ప మొదటి పార్ట్‌ కు బన్నీ తీసుకున్న పారితోషికం తో పోల్చితే రెండవ పార్ట్‌ పారితోషికం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. పుష్ప రెండవ పార్ట్‌ విషయంలో మేకర్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు. బాలీవుడ్‌ రేంజ్ మూవీ అంటూ ప్రచారం చేస్తున్నారు. కనుక పారితోషికం విషయంలో తగ్గకుండా వసూళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అల వైకుంఠపురంలో మూవీకి ఎంత పారితోషికం అయితే తీసుకున్నాడో పుష్ప మొదటి పార్ట్‌ కు అంతే పారితోషికం తీసుకుంటున్నాడు. కాని పుష్ప 2 కు మాత్రం పారితోషికం చాలా స్పెషల్‌ గా ఉంటుందని ఆయన సన్నిహితులు అనధికారికంగా చెబుతున్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా మొదటి పార్ట్‌ చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. మరి కొన్ని రోజుల షెడ్యూల్ తో మొదటి పార్ట్‌ కు గుమ్మడి కాయ కొట్టేయబోతున్నారు. ఈ నెలలో కాస్త పరిస్థితులు అనుకూలిస్తే వెంటనే చిత్రీకరణ మొదలు పెట్టి వచ్చే నెల వరకు షూటింగ్‌ పూర్తి చేసి అనుకున్నట్లుగా ఆగస్టులోనే సినిమాను విడుదల చేయాలని సుకుమార్‌ ఆశ పడుతున్నాడు.

ఇక రెండవ పార్ట్‌ ను మరీ ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలని పుష్ప టీమ్‌ మెంబర్స్ భావిస్తున్నారు. పుష్ప తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా తో పాటు తమిళ స్టార్‌ డైరెక్టర్‌ తో ఒక సినిమా ఇంకా బాలీవుడ్‌ దర్శకుడితో ఒక సినిమాను బన్నీ చేయాల్సి ఉంది. అందులో ఏ సినిమాను బన్నీ మొదట చేస్తాడో చూడాలి.