Begin typing your search above and press return to search.
స్టైలిష్ స్టార్ వేస్తున్న అడుగులు కరెక్టేనా
By: Tupaki Desk | 8 March 2019 9:51 AM GMTస్టార్ గా ఒక స్టేటస్ వచ్చాక ఎక్కువ గ్యాప్ ని భరించడం కష్టం. రిలాక్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ అభిమానుల అంచనాలు పెరిగిపోయి ఒత్తిడి రూపంలో ఇంకో రకమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడే నిర్ణయాలు చూపించడంలో చాలా విచక్షణ చూపించాలి. అల్లు అర్జున్ వరస చూస్తుంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. నా పేరు సూర్య ఎంత డిజాస్టర్ అయినా ఇంత కాలం కథల పేరుతో వేచి చూడటం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు.
పైగా ఇతరులు వద్దని చెప్పిన కథలు స్క్రిప్ట్ లు కోరిమరీ ఎంచుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందారు. నిజానికి వక్కంతం వంశీ నా పేరు సూర్య కథతో వచ్చినప్పుడు బన్నీని వారించిన వాళ్ళే ఎక్కువట. దేశభక్తి కాన్సెప్ట్ కి లొంగిపోయి లోతుగా ఆలోచించకపోవడంతో తగిన ఫలితమే దక్కిందని సన్నిహితులు అంటారు. జూనియర్ ఎన్టీఆర్ తో రెండేళ్లు కలిసి తిరిగినా సరైన నమ్మకం లేకే ఎంత స్నేహితుడైనా వంశీకి తారక్ ఆఫర్ ఇవ్వలేదు.
ఇప్పుడు సుకుమార్ వంతు వచ్చింది. అల్లు అర్జున్ తో చేస్తానని ప్రకటించినందుకు మహేష్ వద్దని చెప్పాడో లేక మహేష్ ఎలాగూ చేయడు కాబట్టి సుక్కు బన్నీతో జత కట్టాడో ఇప్పటికీ బ్రహ్మ రహస్యంగా మిగిలిపోయింది కానీ ఒకరు వద్దన్న కథను మళ్ళి ఓకే చేయడంలో పరమార్థం ఫిలిం నగర్ వర్గాలకు సైతం అంతు చిక్కడం లేదు. ఇంత పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని ఉంటే ఈపాటికి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేది. సరే సుకుమార్ సినిమా హిట్ అయితే ఇవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. తేడా వస్తే చూసారా మహేష్ ఎంత తెలివైన పని చేసాడో అని బన్నీకి దెప్పిపొడుపులు వస్తాయి. ఈ యాంగిల్ లో ఆలోచిస్తే బన్నీ కాస్త తొందరపడ్డాడేమోనని విశ్లేషకుల అభిప్రాయం