Begin typing your search above and press return to search.

త‌న‌పై వున్న గౌర‌వం వ‌ల్లే పోస్ట్ పోన్ చేశాం: బ‌న్నీవాసు

By:  Tupaki Desk   |   15 Feb 2023 11:36 AM
త‌న‌పై వున్న గౌర‌వం వ‌ల్లే పోస్ట్ పోన్ చేశాం: బ‌న్నీవాసు
X
ఈ మ‌ధ్య చాలా వ‌ర‌కు సినిమాలు రిలీజ్ డేట్ విష‌యంలో క్లాష్ అవుతున్నాయి. దీంతో రెండు రిలీజ్ అయితే అందులో ఒక‌టి ప్రేక్ష‌క ఆధ‌ర‌ణకు నోచుకోవ‌డం లేదు. పోఎటీ వ‌ల్ల కొన్ని సార్లు ఇత‌ర సినిమాల‌పై తీవ్ర ప్ర‌భావం చూసుతోంది. ఫ‌స్ట్ క‌లెక్ష‌న్స్ విష‌యంలోనూ ఇది భారీ ప్ర‌భావాన్ని చూపిస్తుండ‌గంతో కొంత మంది నిర్మాత‌లు మ్యూచువ‌ల్ అండ‌స్టాండింగ్ తో త‌మ సినిమాల‌ని మిగ‌తా వారికి భిన్నంగా ఒక్క రోజు ఆల‌స్యంగా రిలీజ్ చేస్తూ వ‌స్తున్నారు.

సంక్రాంతి విడుద‌లైన `వీర సింహారెడ్డి`, వాల్తేరు వీర‌య్య‌` ఇదే త‌ర‌హాలో విడుద‌ల కావ‌డం తెలిసిందే. ఇన‌ప్ప‌డు అదే త‌ర‌హాలో మ‌రో రెండు సినిమాలు కూడా ఒక్క రోజు తేడాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అయితే మ‌రో సినిమా కోసం చిన్న హీరో మూవీని ఒక్క రోజు ఆల‌స్యంగా రిలీజ్ చేస్తుండ‌టం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ధ‌నుష్ న‌టించిన లేటెస్ట మూవీ `సార్‌`. వెంకీ అట్లూరి డైరెక్ష‌న్ లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కాబోతోంది. ఇదే రోజున యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన `విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌` విడుద‌ల చేయాల‌నుకున్నారు. ముర‌ళీ కిషోర‌న్ అబ్బూరు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు నిర్మించారు. ఉన్న‌ట్టుండి ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా రిలీజ్ డేట్ ని మార్చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ విష‌యంపై ర‌కర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాత‌ బ‌న్నీ వాసు స్పందించారు.

ఫిబ్ర‌వ‌రి 17న మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న `శాకుంత‌లం`, ధ‌నుష్ `సార్‌`తో పాటు మా సినిమా `విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌`. అయితే ఇందులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న `శాకుంత‌లం` అనుకోని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డింది. టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ల‌లో మంచి యూనిటీ వుంది. ఒక‌రి సినిమా రిలీజ్ అవుతోందంటే పోటీగా మ‌రో సినిమాని రిలీజ్ చేయ‌రు. మేము నిర్మించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` టైమ్ లో నిర్మాత నాగ‌వంశీ నిర్మించిన `వ‌రుడు కావ‌లెను` రిలీజ్ కు వ‌చ్చింది.

అయితే మా సినిమా రెండేళ్లు ఆల‌స్యం కావ‌డం, ఇంచు మించిఉ ఒకే జాన‌ర్ కు సంబంధించిన సినిమాలు కావ‌డంతో మీ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోమ‌ని నాగ‌వంశీని కోరాను. వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా `వ‌రుడు కావ‌లెను` మూవీ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. మా సినిమాని విడుద‌ల చేశాం.

ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకుని ప్ర‌స్తుతం నాగ‌వంశీ నిర్మించిన `సార్‌` కోసం `విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌`రిలీజ్ ని 17న కాకుండా 18కి మార్చాం. ఇలా మార్చుకోమ‌ని నాగ‌వంశీ న‌న్ను అడ‌గ‌లేదు. కానీ ఆయ‌న‌పై వున్న రెస్పెక్ట్ వ‌ల్లే మా సినిమా రిలీజ్ ని ఒక్క రోజు వాయిదా వేశాం. అని తెలిపారు.