Begin typing your search above and press return to search.
అతడి జీవితాన్ని మార్చిన 'ఆర్య'
By: Tupaki Desk | 16 Sep 2018 5:30 PM GMTఆర్య’ సినిమా చాలా మంది జీవితాలకు గొప్ప మలుపు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ ఏ స్థాయికి చేరాడో తెలిసిందే. ఇక అల్లు అర్జున్ హీరోగా నిలదొక్కుకున్నది ఈ సినిమాతోనే. దిల్ రాజు సోలో నిర్మాతగా సక్సెస్ సాధించి తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూ తెచ్చుకున్నది ఈ చిత్రంతోనే. వీళ్లే కాదు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఆప్త మిత్రుడు బన్నీ వాసు సైతం జీవితంలో స్థిరపడగలిగాడట. తాను ఈ రోజు నిర్మాతగా ఈ స్థాయిలో ఉండటానికి కారణం ‘ఆర్య’నే అంటున్నాడతను. నాటకీయ పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు పంపిణీ చేసి సక్సెస్ సాధించానని.. దాంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని అంటున్నాడు బన్నీ వాసు.
తన కుటుంబం అప్పుల్లో మునిగిపోయిన స్థితిలో ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారం చేద్దామని తాను హైదరాబాద్ వచ్చానని.. అక్కడ యానిమేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన వ్యాపారం చేస్తుండగా.. అనుకోకుండా బన్నీతో పరిచయం జరిగిందని.. అతను సినిమాల్లోకి రావడంతో అన్ని విషయాలూ చూసుకోవడానికి ఒక వ్యక్తి అవసరం అయ్యారని.. తనను నమ్మి బన్నీ అన్న బాబీ తనకు ఆ బాధ్యత అప్పగించారని.. అలా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలైందని వాసు చెప్పాడు. ఐతే తన జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం ‘ఆర్య’నే అని అతను చెప్పాడు. తాను పాలకొల్లు వాడిని కావడంతో ఆ ఏరియాలో ఈ సినిమాను పంపిణీ చేయాలనుకున్నానని.. దిల్ రాజును అడగడంతో లోకల్ డిస్ట్రిబ్యూటర్ ను అడగమన్నారని.. అతను చాలా ఎక్కువ రేటు చెప్పారని.. కానీ ఆ తర్వాత రూ.42 లక్షలకు మొత్తం పశ్చిమగోదావరి ఏరియా హక్కులు తీసుకోమని రాజు అన్నారని.. సరే అని బరిలోకి దిగిపోయానని వాసు చెప్పాడు. ముందు రాజుకు కేవలం 50 రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. నిజానికి తన దగ్గర జిల్లా హక్కుల కొనేంత డబ్బు లేదని.. స్నేహితుల సాయంతో ముందు రూ.15 లక్షలు సమకూరిందని.. ఆ తర్వాత థియేటర్ల అడ్వాన్సులు అవీ కలిపి మొత్తంగా రూ.38 లక్షలు దిల్ రాజు చేతిలో పెట్టామని.. వారం తర్వాత మిగతా డబ్బులిస్తామని చెప్పానని.. ‘మా వాడు ఇచ్చినంత తీసుకోండి. మిగతాది నేను చూసుకుంటా’ అని బన్నీ చెప్పినట్లు రాజు తర్వాత వెల్లడించాడని.. ‘ఆర్య’ పెద్ద హిట్టవడంతో తన ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయాయని.. అప్పులన్నీ కూడా తీర్చేశానని.. అలా ఆ సినిమా తన జీవితాన్ని మార్చిందని వాసు తెలిపాడు.