Begin typing your search above and press return to search.
బన్నీ లాగే అతని స్నేహితుడు!
By: Tupaki Desk | 16 Aug 2018 1:12 PM GMTప్రస్తుతం బాక్స్ ఆఫీస్ బూజు దులుపుతున్న గీత గోవిందం సక్సెస్ రేంజ్ ఎంత అనేది కొలవడానికి కొంత టైం అయితే పడుతుంది కానీ గీత ఆర్ట్స్ టీమ్ సంతోషం మామూలుగా లేదు. ముఖ్యంగా దీనికి నిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాస్ అయితే మరీనూ. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ ని కనక మీరు గమనిస్తే మొదట్లో ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే కొటేషన్ ని పెట్టి బన్నీ అంటే అల్లు అర్జున్ కు థాంక్స్ చెబుతూ వాస్ ఒక స్పెషల్ థాంక్స్ చెప్పాడు. అంటే దీన్ని బట్టి వాస్ అల్లు కాంపౌండ్ లో ఎంత కీలకమైన వ్యక్తో స్టైలిష్ స్టార్ కు ఎంత ఆత్మీయుడో జనానికి తెలిసింది. ఇప్పుడు ఇది మరో రూపంలో చాటబోతున్నాడు వాస్. ఇటీవలే వరదల దెబ్బకు అతలాకుతలమైన కేరళ భాదితుల కోసం అల్లు అర్జున్ 25 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనతో పాటు ఇతర హీరోలు సాంకేతిక నిపుణులు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బన్నీ వాస్ స్నేహితుడితో పోటీ పడే మొత్తాన్ని ప్రకటించాడు.
గీత గోవిందం సినిమాకు కేరళ నుంచి వచ్చే మొత్తం షేర్ విరాళంగా ప్రకటించాడు. అది ఎంత మొత్తం అనేది విడుదలై కలెక్షన్స్ బయటికి వచ్చాక తేలుతుంది కాబట్టి దాని గురించి ఇప్పుడే ఫిగర్ రూపంలో చెప్పలేం. ఏదైమైనా ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ని స్ఫూర్తిగా తీసుకుని బన్నీ వాస్ సైతం సాయం చేయటం ఇతర నిర్మాతలకు కూడా స్ఫూర్తినిస్తే మరికొంత మెరుగైన మొత్తం కేరళ సహాయార్థం అందించొచ్చు. ఈ మధ్య కేరళలో తెలుగు సినిమాలకు వాటి హక్కులకు మంచి డిమాండ్ నెలకొంటోంది. హిట్ టాక్ వస్తే చాలు రీమేక్ లేదా డబ్బింగ్ కోసం పోటీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో లాభాపేక్ష లేకుండా పక్క రాష్ట్రం నుంచి వచ్చే షేర్ మొత్తం అదే రాష్ట్రం కోసం ఇవ్వడం అంటే విశేషమే. నా పేరు సూర్య ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా అందులో బన్నీ వాస్ నిర్మాణ భాగస్వామి మాత్రమే. కానీ గీత గోవిందంకు అతనిదే సింగల్ కార్డు. అందుకే బన్నీ వాస్ ఫుల్ ఖుషిగా ఉన్నట్టు సమాచారం.