Begin typing your search above and press return to search.
ఆ తప్పు తెలుసుకుని లెంపలేసుకుంటున్నా
By: Tupaki Desk | 10 Sep 2015 4:04 AM GMTమారుతిని, ఈరోజుల్లో చిత్రాన్ని చూసి చాలా తక్కువ అంచనా వేశా. అందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నా.. అని అంటున్నాడు బన్ని వాసు. ఈరోజుల్లో సినిమాని 30లక్షల్లో తీసేస్తున్నా అని చెప్పినప్పుడు, హీరో ఎవరో తెలియదన్నప్పుడు, సెట్స్ లో చూసినప్పుడు.. అతడు ఏం చేస్తాడులే అనుకున్నా. ఈరోజుల్లో కథ మారుతి వినిపించినప్పుడు తిట్టాను. కొన్ని కరెక్షన్స్ కూడా చెప్పాను. 30లక్షల్లో ఎక్కడ తీయగలవు? అన్నాను. కట్ చేస్తే తర్వాతి రోజు ఫోన్ చేసినప్పుడు సెట్ లో ఉన్నానని చెప్పాడు. హీరో ఎవరు? అని అడిగినప్పుడు ఫైనల్ అవ్వలేదని చెప్పాడు. ఆఫీస్ లో ఓ కుర్రాడు చేస్తున్నాడులే అన్నాడు. తర్వాతి రోజు సెట్ కి వెళ్లి చూసి షాక్ తిన్నా. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు. ఇంకెప్పుడూ సెట్ కి వెళ్లనే లేదు.
సినిమా పూర్తయ్యాక ఔట్ పుట్ చూసి మరోసారి తిట్టాను. వచ్చినకాడికి అమ్మెయ్ అని సలహా ఇచ్చాను. మారుతి ఫోన్ చేసి ఓ డిస్ట్రిబ్యూటర్ 50వేలు ఆఫర్ చేశాడని చెప్పాడు. అమ్మెయ్ అన్నా. చివరికి 29లక్షలకు అమ్ముడైంది. ఆ తర్వాత గోకుల్ థియేటర్ లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశా. అప్పుడు తెలిసింది రెస్పాన్స్. తక్కువ అంచనా వేశానని అర్థమైంది. నేను జడ్జ్ చేసేది 25 శాతమే. భలే భలే మగాడివోయ్ తో తప్పు రెక్టిఫై చేసుకున్నా. ఈ సినిమా విజయంపై 80శాతం నమ్మకం చెప్పాను. అదే నిజమైంది. ట్రీట్ మారుతీని తక్కువ అంచనా వేసినందుకు లెంపలేసుకుంటున్నా అని చెప్పాడు బన్ని వాసు.