Begin typing your search above and press return to search.
ఫుల్ క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్
By: Tupaki Desk | 6 Sep 2019 5:34 AM GMTజూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ రీసెంట్ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చిన బన్నీ వాస్.. గీతా ఆర్ట్స్ వారు ఆఫర్స్ ఇవ్వకుండా మోసం చేశారంటూ ఫిలిం ఛాంబర్ వద్ద తన చేతికి తాళాలు వేసుకొని ఆందోళన చేసింది. దీంతో ఈ విషయం సంచనలం సృష్టించింది. తాజాగా ఈ విషయంపై బన్నీ వాస్ స్పందిస్తూ ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. జరిగిన విషయాన్ని వివరించారు.
సునీత బోయ "నేను జనసేనలో పని చేశాను.. నాకు ఏదైనా అవకాశాలు ఇప్పించండి" అంటూ తమను ఎప్రోచ్ అయ్యిందని చెప్పారు బన్నీ వాస్. "జనసేనలో పని చేసింది అనే కారణమేకాదు.. సునీత నాన్నగారు మాకు తెలిసిన థియేటర్స్ లో పనిచేశారు. అందుకే ఏవైనా ఆడిషన్స్ ఉంటె నీకు చెప్పాలని మావాళ్ళకు సూచించాను.. మావాళ్ళు కూడా ఆడిషన్స్ ఉన్నప్పుడు తనకు ఆ విషయం చెప్పారు. సునీత కూడా ఒకసారి ఆడిషన్ కు హాజరయ్యానని స్వయంగా చెప్పింది."
"ఇక్కడ ఆడిషన్ టెస్ట్ పాస్ అయితే తప్పకుండా అవకాశం వస్తుంది. బాగా చేసినా కూడా ఈ అమ్మాయిని తీసుకోవద్దు అని ఎవరూ తనను ఆపరు. మేము అసలు అలాంటివి పట్టించుకోం. హీరో హీరోయిన్.. ఇతర ముఖ్యమైన ఆర్టిస్టులు తప్ప మా సినిమాలో ఎవరు పనిచేస్తున్నారో మాకు తెలియదు.. ఎందుకంటే మాకు వేరే పనులు చాలా ఉంటాయి. అయితే మాకు అర్థం అయిన విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఈ ప్రాసెస్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు. తన అగ్రెసివ్ నేచర్ తో ఇబ్బందులు తెచ్చుకుంటోంది. మా ఆఫీసు గేటు దగ్గరకు వచ్చి హడావుడి చేసి 'నాకు అవకాశం ఎందుకు ఇవ్వరు' అని నిలదీసినందువల్ల ప్రయోజనం ఉండదు. అవకాశాలు కావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆడిషన్స్ లో పాల్గొనాలి.. ఆడిషన్ టెస్ట్ పాస్ అవ్వాలి అప్పుడే అవకాశం వస్తుంది."
"రాత్రి 8.30 సమయంలో నువ్వు ఆఫీస్ దగ్గరకు వచ్చి పెద్దపెద్దగా అరుస్తూ గొడవ చేస్తే మేము పోలీసులను పిలవకుండా ఏం చేయాలి? నీతో మాట్లాడించి సర్ది చెప్దామంటే మా ఆఫీస్ లో ఎవరూ లేడీస్ లేరు. ఆరోజు పోలీసులు నిన్ను స్టేషన్ కు తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ అమ్మాయిని వదిలేయమని పోలీసులకు కేసు ఫైల్ చేయవద్దని చెప్పాను."
"అది జరిగిన తెల్లవారే నువ్వు మా ఆఫీస్ దగ్గర కు వెళ్లి కిచెన్ లో కత్తి తీసుకుని 'నేను పొడుచుకుంటాను' అని బెదిరిస్తే ఏం జరుగుతుందోనని మా ఆఫీస్ వాళ్ళు భయపడ్డారు. దీంతో మరోసారి పోలీసులను పిలవాల్సి వచ్చింది. ఇలాంటి ప్రవర్తనతో మాకు చాలా ఇబ్బంది కలిగింది. ఆరోజు నేను స్టేషన్ కు వచ్చాను. అక్కడ పోలీసులతో పాటుగా ఒక కౌన్సెలర్ ఉన్నారు. నీకు ఆయన నచ్చజెప్పారు. నేను కూడా 'మమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దు .. అవకాశాల కోసం ఫలానా వారితో టచ్ లో ఉండు..ఏదైనా ఆడిషన్ ఉంటే వాళ్ళు నీకు చెప్తారు' అని క్లియర్ గా చెప్పాం. మా పేరెంట్స్ కు బాగాలేదన్ని నువ్వు చెప్తే.. మాకు చేతనైనంత సహాయం చేస్తామని చెప్పాము."
"ఇది జరిగిన 10 రోజుల్లో నువ్వు మీ పేరెంట్స్ ను తీసుకువచ్చి మా గేటు దగ్గర వదిలేశావు. అలా చేస్తే మేము ఏమనుకోవాలి? అయితే మేము కారు మాట్లాడించి వారిని అనంతపూర్ కు పంపించాము. నువ్వు ఆడపిల్లవని.. అవకాశాల కోసం కష్టపడుతున్నావని మేము మేము ఇవన్నీ పట్టించుకోలేదు. అయితే నువ్వు ఒక ఆర్టిస్టు కావాలంటే నీకు బ్యాలెన్స్ ఉండాలి. అసలు బ్యాలెన్స్ లేకుండా ఇలా చేస్తే ఇప్పుడే కాదు.. ఇంకో పదేళ్ళు అయినా నువ్వు ఇలాగే ఉంటావు. నిన్ను తీసుకోవడానికి ఎవరైనా భయపడతారు."
"ఇక రెండు రోజుల తర్వాత నువ్వు ఛాంబర్ లో లాక్ చేసుకోవడం.. ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇష్యూ ఛాంబర్ లో ఉంది. అవకాశాలు ఇస్తామని ఒక పెద్ద సంస్థ చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయికి సిట్యుయేషన్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇలా చేసుకుంది. జరిగిన విషయమిది." అంటూ తన వైపు వెర్షన్ వినిపించారు బన్నీ వాస్.