Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ సక్సెస్ సీక్రెట్ ఇదేనట

By:  Tupaki Desk   |   20 Aug 2018 10:21 AM IST
అల్లు అరవింద్ సక్సెస్ సీక్రెట్ ఇదేనట
X
అల్లు అరవింద్.. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన సొంతమయ్యాయి. గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వస్తుందంటే దానిపై బోలెడు అంచనాలున్నాయి. అరవింద్ జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుందని సినిమా ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఇంతకీ ఏ నిర్మాతకు సాధ్యం కాని ఇంత ట్రాక్ రికార్డు అరవింద్ కు ఎందుకొచ్చింది. దీని వెనుక ఆయన ఏం చేస్తాడు.? అసలు ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటనే దానిపై తాజాగా ఆయన సన్నిహితుడు బన్నీవాసు సంచలన నిజాలు చెప్పాడు. ఆ మాటలు వైరల్ గా మారాయి.

ఇటీవల అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా.. గీతా ఆర్ట్స్ 2 అనే సబ్ బ్యానర్ సృష్టించి ‘గీతాగోవిందం’ మూవీ తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందరూ మరోసారి అరవింద్ జడ్జిమెంట్ ను సూపర్ అంటున్నారు. అయితే అరవింద్ డబ్బు మనిషి.. తన సినిమాల మీద చాలా లెక్కలు వేసుకొని తీసి ఇలా హిట్ కొడుతుండాటని చాలా మంది ఆరోపిస్తుంటారు. దీనిపై తాజాగా అల్లు అరవింద్ శిష్యుడైన బన్నీవాసు వివరణ ఇచ్చారు..

‘అల్లు అరవింద్ పూర్తి భిన్నమైన వ్యక్తి. ఒక సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలనేది పక్కాగా నిర్ణయిస్తారు. కథకు న్యాయం చేయడానికి ఖర్చు పెరిగినా వెనక్కి తగ్గరు. చేయాల్సిదంతా 100శాతం చేస్తారు.. అదే ఆయన సక్సెస్ సీక్రెట్’ అని బన్నీవాసు తెలిపారు..

సినిమా విడుదలకు ముందు మాత్రమే అరవింద్ లెక్కలు వేసుకుంటాడని బన్నీ వాసు తెలిపారు. సినిమాకు ఎంత ఖర్చు అయ్యింది.? బిజినెస్ ఎంత చేయాలనే దానిపైనే లెక్కలు వేస్తారని వివరించాడు. అవుట్ పుట్ విషయంలో రాజీపడడని.. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సంతృప్తి దక్కదాకా ఎంతైనా ఖర్చు చేస్తారని వాసు తెలిపారు. అందుకే ఆయనకు అన్ని సక్సెస్ లు వస్తున్నాయని వివరించాడు.