Begin typing your search above and press return to search.

బన్నీ ఎంత సిగ్గరి అంటే

By:  Tupaki Desk   |   30 April 2018 10:00 AM IST
బన్నీ ఎంత సిగ్గరి అంటే
X
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ తెలుసు. ఓ హీరోగా కాకుండా మామూలు ఫ్రెండ్ గా.. 20 ఏళ్ల సాధారణ కుర్రాడిలా.. జీవితంలో పైకి రావాలని తపించే యువకుడిగా ఉన్న బన్నీ ఎలా ఉండేవాడో తనకే తెలుసంటున్నాడు బన్నీ వాస్. అల్లు అర్జున్ నటించే అన్ని సినిమాలకు ఏదో రకంగా ఇన్వాల్వమెంట్ ఉండే వ్యక్తి బన్నీ వాస్.

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీకి బన్నీ వాస్ కూడా ఓ ప్రొడ్యూసర్. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన టైంలో తనకు.. అర్జున్ కు మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ని బన్నీ వాస్ చెప్పుకొచ్చాడు. ‘‘లైఫ్ లో ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో తెలియని రోజుల్లోనే అర్జున్ తో పరిచయమైంది. నాతో ఉంటావా అని అతను అడిగిన మాట లైఫ్ ని మార్చేసింది. బన్నీ మొదటి సినిమా గంగోత్రి రిలీజయ్యాక చాలా నెగిటివ్ కామెంట్లొచ్చాయి. చాలా బాధపడ్డా. కానీ ఆర్య సినిమా నాటికి తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. బన్నీ తనన అలాంటిది. అది ఇంకెవరిలోనూ చూడలేదు’’ అంటూ బన్నీ వాస్ అల్లు అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.

‘‘మొదట్లో బన్నీ ఆఫీస్ గా ఓ షెడ్డే ఉండేది. దానికి కూడా లక్ష రూపాయలు వాళ్ల నాన్న అరవింద్ ని అడగడానికి ఎంత సిగ్గుపడ్డాడో నాకు తెలుసు. ఈ రోజు హీరోగా కోట్లు సంపాదిస్తున్నా ఎవరినైనా అడగడానికి అంతే సిగ్గు పడతాడు. మేమిద్దరం ఎన్నోసార్లు కొట్టుకున్నాం.. తిట్టుకున్నాం. కానీ కలిసే ఉన్నాం. బన్నీ సినిమాలు చాలావాటికి పనిచేశా. కానీ అతడిని స్క్రీన్ పై చూశాక కడుపు నిండిపోయిన ఫీలింగ్ నా పేరు సూర్యతోనే వచ్చింది’’ అంటూ బన్నీ బాస్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు.