Begin typing your search above and press return to search.
ఔను 'బ్యాచిలర్' ను మద్యలో మార్చేశాం
By: Tupaki Desk | 11 Oct 2021 2:30 AM GMTఅఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను దసరా సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి కూడా సినిమా గురించిన పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈమద్య సినిమా కు కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేశారని.. మొదట అనుకున్న స్క్రిప్ట్ కాకుండా మార్చారు అంటూ పుకార్లు పుట్టుకు వచ్చాయి. తాజాగా ఆ విషయమై నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సెకండ్ హాఫ్ విషయంలో కథను మార్చాలని.. క్లైమాక్స్ ను ఇంకాస్త బెటర్ గా అనుకున్నట్లుగా చెప్పాడు. కాని నేను మొదట మార్చేందుకు ఒప్పుకోలేదు. మొదట ఏదైతే అనుకున్నామో అదే చేయాలనుకున్నాను. కాని భాస్కర్ చాలా నమ్మకంతో ఆ మార్పులను చెప్పడంతో నేను కన్విన్స్ అయ్యాను.
స్క్రిప్ట్ లో చేసిన మార్పులను అల్లు అరవింద్ గారికి వినిపించగా పూర్తి స్క్రిప్ట్ మళ్లీ చెప్పమన్నాడు. అప్పుడు పూర్తి స్క్రిప్ట్ ను కలిపి విన్న తర్వాత మార్పు చేసిన స్క్రిప్ట్ విషయంలో చాలా సంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. కొత్త ఐడియాపై వర్కౌట్ చేసి బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నట్లుగానే సినిమాను ముగించామని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. భాస్కర్ చెప్పిన కొత్త ఐడియా కారణంగా సినిమా స్థాయి మారిపోయింది. సినిమా సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ చాలా అద్బుతంగా వచ్చిందని బన్ఈన వాసు అంటున్నాడు. సినిమా ను మద్యలో మార్చడం వల్ల ఒక మంచి క్లైమాక్స్ తో పాటు సెకండ్ హాఫ్ అద్బుతంగా వచ్చిందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అఖిల్ భారీ అంచనాల నడుమ హీరోగా పరిచయం అయ్యాడు. కాని ఇప్పటి వరకు కమర్షియల్ గా పెద్ద హిట్స్ ను దక్కించుకోలేక పోయాడు. ప్రతి ఒక్క సినిమా కూడా ఆయన అభిమానుల నమ్మకంను నిలబెట్టుకోలేక పోయాయి. కాని ఈ సినిమా ప్రమోషనల్ స్టఫ్ మరియు ఇతర విషయాలను పరిశీలిస్తే ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో బ్యాచిలర్ ను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ కు జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించింది. సినిమాలో కథ చాలా విభిన్నంగా ఉంటుందని.. హీరోయిన్ పాత్ర మాత్రమే కాకుండా హీరో పాత్ర కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని హీరోలకు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ ఉంది. కనుక ఈ సినిమా తో అఖిల్ కు మొదటి కమర్షియల్ సక్సెస్ దక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.