Begin typing your search above and press return to search.
చావు కబురు చల్లగా ఫెయిల్యూర్ ను ఒప్పేసుకున్నాడు
By: Tupaki Desk | 12 Jun 2021 12:30 AM GMTసినిమా హిట్ అయితే దాని మీద బోలెడంత చర్చ జరుగుతుంది. అదే సమయంలో సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉండి.. నిరాశ పరిస్తే కూడా అదో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారుతుంది. అయితే.. హిట్ ఎదురైనప్పుడు రియాక్టు అయ్యే దర్శక నిర్మాతలు.. డిజాస్టర్ అయినప్పుడు మాత్రం స్పందించే సాహసం చేయరు. ఆ మాటకు వస్తే ఆ అంశం మీద పెదవి విప్పేందుకు ఆసక్తిని చూపించరు. అలాంటిది.. ప్లాప్ షో గా మారిన మూవీ గురించి మాట్లాడటం.. అందులో చోటు చేసుకున్న లోపాన్ని ఓపెన్ గా మాట్లాడటం చాలా తక్కువ.
తాజాగా ఆ పని చేశారు నిర్మాత బన్నీ వాసు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చావు కబురు చల్లగా మూవీ బోర్లా పడటంపై స్పందించారు. మాంచి బజ్ తో.. భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఏ మాత్రం కనెక్టు కాలేకపోయింది. ఎందుకలా జరిగింది? ఎక్కడ మిస్టేక్ దొర్లింది? అన్నది ప్రశ్న. దీనికి బన్నీ వాసు తాజాగా రియాక్టు అయ్యారు.
చావు కబురుచల్లగా మూవీ మొత్తం తల్లి పాత్ర చుట్టూనే తిరుగుతుందని. ఆ పాత్రను ప్రేక్షకులకు కనెక్టు అయ్యేలా చూపించలేకపోవటమే సినిమా ఫెయిల్యూర్ కు కారణమని చెప్పారు. తల్లి పాత్రను కనెక్టు అయ్యేలా డిజైన్ చేయటంతో పాటు.. హీరో పాత్రను తీర్చిదిద్దిన వైనం కూడా సరిగా లేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన ఓటీటీ ప్లాట్ పాం గురించి బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే నిర్మాతకు వచ్చే ఆదాయంతో పోల్చినప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వల్ల రాదన్నారు. ఈ కారణంతోనే రెగ్యులర్ నిర్మాతలందరూ నాలుగు రోజులు లేట్ అయినా థియేటర్లలో తమ సినిమాల్ని విడుదల చేయాలని భావిస్తున్నారే తప్పించి.. ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకోవటం లేదన్నారు.