Begin typing your search above and press return to search.
బన్ని Vs రౌడీ! ఇన్ స్టాలో ఎవరు టాప్?
By: Tupaki Desk | 18 Aug 2022 2:30 AM GMTఇన్ స్టాగ్రామ్ లో టాప్ 8 అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ మేల్ స్టార్ ల జాబితా తాజాగా రివీలైంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండను వెనక్కి నెట్టి అల్లు అర్జున్ టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. తనదైన యూనిక్ స్టైల్ వైబ్రేంట్ మేనరిజంతో సామాజిక మాధ్యమాల్లో దూసుకెళుతున్న దేవరకొండ ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేశాడు. అయితే దీనికి కారణం పుష్ప చిత్రంతో బన్నీకి హిందీ బెల్ట్ లో పాపులారిటీ అమాంతం పెరగడమేనని భావించవచ్చు.
సినిమా ప్రకటనలు.. ప్రమోషనల్ మెటీరియల్ సహా వ్యక్తిగత అంశాలను సామాజిక మాధ్యమంలో షేర్ చేయడం ద్వారా .. కమర్షియల్ ప్రకటనలతో అలరించడం .. పెద్ద బ్రాండ్ లతో డీల్ లను పొందడం ఇలా అన్ని కోణాల్లో పరిశీలించి సోషల్ మీడియా ప్రముఖుల జాబితాను రూపొందించగా ఆ ఇద్దరూ టాప్ 1 టాప్ 2 పొజిషన్ లో నిలిచారు.
అల్లు అర్జున్ ఇప్పుడు పాన్-ఇండియా స్టార్. ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత ప్రభావవంతమైన నటులలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న స్టార్ గా విజయదేవరకొండ పేరు నిలిచింది. అయితే విజయ్- అజిత్ వంటి తమిళ స్టార్లు సోషల్ మీడియాల్లో అధికారికంగా లేకపోవడంతో వారికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.
అల్లు అర్జున్ - 18.8 మిలియన్ ఫాలోవర్స్ తో నంబర్ వన్ స్థానంలో నిలిచారు. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు ఓపెనయ్యాయి. అదే సమయంలో అల్లు అర్జున్ నటించిన `పుష్ప: ది రైజ్` ప్రేక్షకులను సినిమా హాళ్లకు రప్పించింది. సౌత్ స్టేట్స్ లోనే కాకుండా నార్త్ మార్కెట్ లోనూ ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. బన్ని పాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ ప్రజాదరణ పొందాడు. ఇన్ స్టాగ్రామ్ లోనూ అభిమానుల ఫాలోయింగ్ దానిని నిరూపించింది. అలాగే అతను తన సోషల్ మీడియా గేమ్ ను రియాలిటీకి దగ్గరగా ఉంచుతున్నాడు.
16.9 మిలియన్ ల ఫాలోవర్లతో విజయ్ దేవరకొండ టాప్ 2లో ఉన్నాడు.
అతడు నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ తన మొదటి పాన్-ఇండియా చిత్రం లైగర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇన్ స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో అల్లు అర్జున్ తర్వాత సౌత్ ఇండియన్ సెలెబ్స్ లో రెండోవాడిగా నిలిచాడు. IGలో 301 పోస్ట్ లతో సోషల్ మీడియా గేమ్ ను తెలివిగా నడిపించడంలో VD బెస్ట్ అని నిరూపించాడు.
11 మిలియన్ ఫాలోవర్స్ తో యష్ .. దుల్కార్ లు మూడో స్థానంలో నిలిచారు. ఫోటో షేరింగ్ యాప్ లో అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ తర్వాత అత్యధికంగా ఫాలో అవుతున్న సౌత్ నటుల్లో యష్- దుల్కార్ లు 3వ స్థానంలో ఉన్నారు. యష్ తన సోషల్ మీడియాలో ఏదైనా అప్ లోడ్ చేసే విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటాడు. అతని పోస్ట్ లలో ఎక్కువ భాగం కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు ఉన్నాయి. KGF 2 ప్రమోషన్ల సమయంలో అతని సోషల్ మీడియా గేమ్ బాగా మెరుగుపడింది.
దుల్కర్ సల్మాన్ మోలీవుడ్ హార్ట్ త్రోబ్ గా చక్కని ఫాలోయింగ్ ని కలిగి ఉన్నాడు. ఇన్ స్టాలో అత్యధికంగా ఫాలో అవుతున్న దక్షిణాది యువ ప్రముఖులలో 3వ స్థానంలో నిలిచాడు. అతని భార్య అమల్ సుఫియా .. కుమార్తెతో అతని వెకేషన్ ఫోటోలు అతని టైమ్ లైన్ లో హైలైట్. అలాగే తన సినిమాలను ప్రమోట్ చేయడంలో అతడు అభిమానులతో ముచ్చటిస్తుంటారు. దుల్కార్ తాజా చిత్రం సీతా రామం అందుకు నిదర్శనం! అతను KGF స్టార్ యష్ కి సమానంగా ఇన్ స్టా లీగ్ లో ఉన్నాడు.
8.7 మిలియన్ ల ఫాలోవర్స్ తో మహేష్ నాలుగో స్థానంలో నిలిచాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ లో అతని కుటుంబ ఫోటోలే ఎక్కువ. ఇటీవల అతడికి ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది. నిజానికి మహేష్ బాబు అప్పుడప్పుడు లేదా సెలవుల్లో ఉన్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ కి టచ్ లోకి వస్తుంటారు. తన సినిమాల విడుదల సమయంలో కూడా మహేష్ బాబు వాటిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించేది తక్కువే. MB నటించిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగులు సాధించినా కానీ పెద్ద స్కోర్ ను చేయలేకపోయింది.
8.2 మిలియన్ ల ఫాలోవర్స్ తో రామ్ చరణ్ ఐదో స్థానంలో నిలిచాడు. RRR తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. 2019లో అతడు ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టాడు. అతను ఫోటో షేరింగ్ యాప్ లో అరంగేట్రం చేసిన 12 గంటల్లోనే 1.37 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు. అయితే సోషల్ మీడియాలో ఆర్సీ పెద్దగా యాక్టివ్ గా లేరు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటులలో RC ఒకరిగా ఉన్నా కానీ అతను తన ఇన్ స్టా గేమ్ పై పెద్దగా దృష్టి సారించలేదు. ఫాలోయింగ్ పెరగాలంటే అభిమానులతో మరింత సన్నిహితంగా ఉండాలి.
4.5 మిలియన్ల ఫాలోవర్స్ తో ఎన్టీఆర్ ఆరో స్థానంలో ఉన్నారు. ఎన్టీఆర్ మీడియా గ్లిజ్ కి సోషల్ మీడియా ప్రమోషన్స్ కి దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. అతను సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. అయినప్పటికీ తారక్ క్రేజ్ RRR తో అమాంతం పెరిగింది. అతడి పేరు ఇప్పుడు ఆస్కార్ బరిలో వినిపిస్తుండడం క్రేజ్ ని పెంచుతోంది.
8.6 మిలియన్ ఫాలోవర్లతో ప్రభాస్ ఏడో స్థానంలో నిలిచాడు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా బాహుబలి స్టార్ ప్రభాస్ భారీ ఫాలోవర్లను సంపాదించుకోగలిగాడు. అతను తన సినిమాలను ప్రమోట్ చేయడానికి.. పరిశ్రమలోని తన సన్నిహితుల పుట్టినరోజుల సందడి చేయడం లేదా సామాజిక అంశాల్లో మద్దతు ఇవ్వడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తాడు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ 3డి- సలార్ సహా 4 పాన్-ఇండియా ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.