Begin typing your search above and press return to search.

పిక్ టాక్: స్టైలింగ్ లో హీరోయిన్‌లకు పోటీ ఇస్తోన్న బన్నీ భార్య..!

By:  Tupaki Desk   |   28 Oct 2022 3:55 AM GMT
పిక్ టాక్: స్టైలింగ్ లో హీరోయిన్‌లకు పోటీ ఇస్తోన్న బన్నీ భార్య..!
X
హీరోలకు ఎంత క్రేజ్ ఉందో.. వారి భార్యామణులకు కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది. మన టాలీవుడ్ స్టార్ వైవ్స్ సోషల్ మీడియాలో తమ భర్తలకు పోటీగా సందడి చేస్తుంటారు. వారిలో కొందరు ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్నవారైతే.. మరికొందరు ఎలాంటి సినీ నేపథ్యం లేని వారున్నారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఒకరు.

అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ ని ప్రేమ వివాహం చేసుకుని 'అల్లు' ఫ్యామిలీకి కోడలిగా అడుగుపెట్టింది. ప్రస్తుతం తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

స్నేహ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను.. పిల్లలు చేసే అల్లరి వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీ టూర్స్‌ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి.

ఈ క్రమంలో బన్నీకి ఎంత పాపులారిటీ ఉందో.. ఆమె కూడా అంతే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్ లో స్నేహా రెడ్డికి 8.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటేనే నెట్టింట ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సినీ బ్యాగ్రౌండ్ లేని స్టార్ వైవ్స్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా బన్నీ భార్య నిలిచారని చెప్పాలి. సినిమా హీరోయిన్లకు ధీటుగా క్రేజ్ ఏర్పరచుకున్న స్నేహా రెడ్డి.. సోషల్ మీడియాలో వారికి గట్టి పోటీనిస్తోంది. నిజానికి చాలా మంది హీరోయిన్లకు కూడా ఇన్స్టాగ్రామ్ లో అంతమంది ఫాలోవర్స్ లేరు.

ఇక ఐకాన్ స్టార్ కు తగ్గట్లు ఆయన భార్య కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. స్టైలింగ్ అండ్ డ్రెస్సింగ్ లో తన భర్తకు ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ తో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌ లో తన ఫ్యాషన్ రూపాన్ని ప్రదర్శిస్తుంది.

ట్రెండీ లుక్ లో స్నేహరెడ్డి షేర్ చేసే ఫోటోలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. వాస్తవానికి ఆమె అన్ని వేళలా విభిన్నమైన దుస్తులను ఎంచుకుంటూ.. గ్లామరస్ స్టార్ హీరోయిన్‌ కు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది.

ఇప్పుడు లేటెస్టుగా బన్నీ భార్య కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో సిల్వర్ కార్డ్ స్ట్రాప్‌ లెస్ ట్యూబ్ బ్లౌజ్ మరియు ఆకుల మాదిరిగా డిజైన్ చేసిన సారీ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది స్నేహ. నిజానికి ఇది ప్రముఖ డిజైనర్ రిమ్జిమ్ దాదు మెటాలిక్ కార్డ్స్‌ తో రూపొందించిన ఫోలేజ్ ఫ్రింజ్ చీర.

సారీ ఖరీదు ₹1,76,000 వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఈ కాస్ట్యూమ్స్ లో స్నేహా రెడ్డి తన పోజులతో అందచందాలను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీ డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ ఆమెకు స్టైలింగ్ చేసాడు. అల్లు స్నేహరెడ్డి తన షార్ప్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.