Begin typing your search above and press return to search.
#లవ్ పెయిర్.. క్యూటీ అంటూ భార్యంటే బన్నీకి ఎంత ప్రేమ!
By: Tupaki Desk | 29 Sep 2021 7:30 AM GMTటాలీవుడ్ ఆదర్శ దంపతులుగా అల్లు అర్జున్-స్నేహారెడ్డిని అభిమానులు ఆరాధిస్తారు. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి ఈ జోడీ పెళ్లి చేసుకున్నారు. 2011లో పెళ్లయింది. ప్రస్తుతం ఈ జంట దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఇద్దరి ప్రేమకి గుర్తు ఆయాన్..అర్హ ఉన్నారు. పిల్లలంటే బన్నీ ఎంతగా ఇష్టపడతారో చెప్పాల్సిన పనిలేదు. ఖాళీ సమయం దొరికితే పిల్లలతోనే సరదాగా గడుపుతారు. విదేశీ ట్రిప్పులు వెకేషన్లు అరుదుగా...వీలైనంత వరకూ హైదరాబాద్ లో ఔటింగులను ఎక్కువ ఇష్టపడతారు. పండగలు..పబ్బాలు వచ్చాయంటే స్నేహారెడ్డి అమ్మమ్మ ఇల్లు ఉన్న పల్లెటూరు కి వెళ్తుంటారు. ఓ పెద్ద స్టార్ ఇలా పల్లెటూరులో బస చేయడం అన్నది నిజంగా బన్నీ నిరాడంబరతకు అద్దంపడుతుంది.
కాగా నేడు సెప్టెంబర్ 29 బన్నీ సతీమణి స్నేహా పుట్టిన రోజు . ఈ సందర్భంగా సతీమణికి బన్నీ ప్రత్యేకంగా విషెస్ తెలియజేసారు. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్ లో ఉండటంతో నా అదృష్టం. మరెన్నో పుట్టిన రోజులు నీతో గడపాలనుకుంటున్నాడు. హ్యాపీ బర్త్ డే క్యూటీ` అంటూ తన సందేహాన్ని పాస్ చేసారు. అలాగే ఇన్ స్టా వేదికగా మిడ్ నైట్ బర్త్ డే కేక్ ని కట్ చేసిన ఫోటోని అభిమానులకు షేర్ చేసారు. ఇక పరిశ్రమ ప్రముఖులు.. దర్శక నిర్మాతలు.. అభిమానులు స్నేహకి శుభాకాంక్షలు తెలిపారు.
బన్నీ సఖియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫ్యామిలీలో చోటు చేసుకున్న బెస్ట్ మూవ్ మెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులకు చేర వేస్తుంటారు. ఇక ఇన్ స్టాలో భారీగా పాలోవర్స్ కలిగిన నాన్ సెలబ్రిటీగాను స్నేహ ఖ్యాతికెక్కారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది బన్నీ కెరీర్ లో తొలిసారి తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి భారీ హైప్ ని తీసుకొచ్చాయి.