Begin typing your search above and press return to search.
బర్నింగ్ స్టార్ సంపూ.. కొత్త సినిమా అనౌన్స్ మెంట్!
By: Tupaki Desk | 8 May 2021 12:30 PM GMTతెలుగు ఇండస్ట్రీలో బర్నింగ్ స్టార్ అంటే ఎవరో అందరికి తెలుసు.. ఎందుకంటే అతనికి సిక్స్ ప్యాక్ బాడీ లేకపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో క్రేజ్ మాత్రం బాగానే ఉంది. తనకంటూ డిఫరెంట్ జోనర్ క్రియేట్ చేసుకొని తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ హీరోనే సంపూర్ణేశ్ బాబు. 2014లో 'హృదయకాలేయం' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంపూ.. ఫస్ట్ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే జోరులో సినిమాలు చేస్తూ పోయాడు కానీ సక్సెస్ రేట్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయాడు. హృదయకాలేయం మూవీ తర్వాత వరుసగా ప్లాప్స్ అందుకొని చివరిగా కొబ్బరిమట్ట అనే సినిమాతో హిట్ అందుకున్నాడు.
సినిమా సినిమాకు వెరియేషన్ చూపించే సంపూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించి సినిమా పోస్టర్ కూడా విడుదల చేసాడు. ఇంకా పేరు కూడా పెట్టని ఈ సినిమా ఓ మెడికల్ థ్రిల్లర్ మూవీ.. లాక్డౌన్ ముగిసి ఇన్నినెలలు గడుస్తున్నా ప్రస్తావనలోకి రాలేదు. ఇంతకీ ఆ సినిమా వస్తుందో లేదో అసలు పూర్తయిందా అనేది తెలియదు. ఇదిలా ఉండగా.. కరోనా టైంలో అందరు హీరోలు ఫ్యూచర్ మూవీస్ లైనప్ లో పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సంపూ కూడా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేసేపనిలో పడ్డాడు.
ఇదివరకే 'క్రేజీ అంకుల్స్' ఫేమ్ కిరణ్ తలసియా దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందని టాక్ నడిచింది. ఇంతలో తాజాగా సంపూ 5వ సినిమా అనౌన్స్ మెంట్ మే 9న ఉదయం 9గంటల 11 నిముషాలకు జరగనుంది. ఈ విషయం తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ - పోస్టర్ రేపు ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాను మధుసూదన క్రియేషన్స్ - రాధాకృష్ణ టాకీస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. మిగతా వివరాలు రేపు ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి సంపూ స్పీడ్ పెంచినట్లే అనిపిస్తుంది. చూడాలి ఈసారి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో!