Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: బుర్రకథ అంటున్న యువహీరో

By:  Tupaki Desk   |   11 April 2019 8:00 AM GMT
ఫస్ట్ లుక్: బుర్రకథ అంటున్న యువహీరో
X
యంగ్ హీరో ఆది సాయి కుమార్ స్పీడ్ తగ్గినట్టు అనిపించింది కానీ మళ్ళీ జోరు చూపిస్తున్నాడు. ఈమధ్యే ఉగాది సందర్భంగా అది నటించే 'జోడి' అనే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనాథ్ అరిగెల దర్శకుడు. ఈ సినిమా కాకుండా మరో సినిమాతో ప్రేక్షకల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. సినిమా టైటిల్ 'బుర్రకథ'.

ఈ సినిమాతో పాపులర్ టాలీవుడ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా సమాచారం. ఇందులో హీరో పుట్టడమే రెండు బ్రెయిన్లతో పుడతాడట. అందుకే హీరో స్ప్లిట్ పర్సనాలిటీ సమస్యతో బాధపడుతుంటాడట. దీంతో ఆదికి ఎదురయ్యే సంఘటనలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని.. సినిమా అంతా ఫన్నీగా సాగుతుందని సమాచారం. టైటిల్ లోగో కూడా సినిమా కాన్సెప్ట్ కు తగ్గట్టే డిజైన్ చేశారు. రెండు బుర్రల కథ కాబట్టి బుర్రకథ అని టైటిల్ కూడా సూటబుల్ గా ఉంది.

'బుర్రకథ' షూటింగ్ అంతా పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందని సమాచారం. ఈ సమ్మర్లోనే 'బుర్రకథ' ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడీగా మిష్తి చక్రబర్తి.. నైరా షా హీరోయిన్లు గా నటిస్తున్నారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.