Begin typing your search above and press return to search.
`బుర్రకథ` ఎట్టకేలకు రిలీజ్ ఫిక్స్
By: Tupaki Desk | 1 July 2019 12:11 PM GMTరిలీజ్ డైలమా వల్ల ఎలాంటి టెన్షన్ కి గురవుతుందో చెప్పాల్సిన పనేలేదు. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ తాకిడికి గురైన రైతులా అయిపోతుంది పరిస్థితి. రిలీజ్ టైమ్ లో ఏ నిర్మాత - దర్శకులకు ఉండే టెన్షన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలే వారానికి ఐదారు సినిమాలు రిలీజవుతుంటే ఓవైపు ప్రైమ్ ఏరియాలో థియేటర్లు దొరకని టెన్షన్ ఉంటుంది. మంచి థియేటర్లలో వేస్తేనే సినమా ప్రేక్షకులకు చేరువవుతుంది కానీ.. ఏదో ఒక థియేటర్ లో వేసినా జనాలకు చేరని సన్నివేశం ఉంటుంది.
ఇకపోతే ఇటీవల `బుర్రకథ` టీమ్ కి రిలీజ్ టెన్షన్ తప్పలేదు. గత నెల 28 న రావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. అదే నెల 29 రిలీజవుతుందని పోస్టర్ వేసినా కుదరలేదు. అటుపై దర్శకహీరోలు మీడియా ముఖంగా సెన్సార్ ట్రబుల్స్ వల్ల రిలీజ్ కుదరలేదని ప్రకటించారు. అన్నిటినీ క్లియర్ చేసుకుని కొత్త తేదీని చెబుతామన్నారు.
ఎట్టకేలకు జూలై 5 రిలీజ్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఈ వారం ఒకేసారి ఐదు సినిమాలు రిలీజవుతుండడంతో ఇతరులతో మాట్లాడుకుని థియేటర్ల పరంగా సమస్యల్లేకుండా ప్లాన్ చేశారట. అయితే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత కొంతకాలంగా ఫ్లాపుల నుంచి బయటపడేందుకు హీరో ఆది చేయని ప్రయత్నం లేదు. అందుకే `బుర్రకథ` పైనే ఆది హోప్స్ అన్నీ. డైమండ్ రత్నం డెబ్యూ చిత్రం కావడంతో అతడికి టెన్సన్ సన్నివేశం ఉంది. ఈ ప్రయత్నం సక్సెస్సేనా? అన్న ముచ్చటా సాగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రైట్స్ ను వింటేజ్ క్రియేషన్స్ దక్కించుకుని రిలీజ్ చేస్తోంది. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై హెచ్ కె.శ్రీకాంత్ దీపాల నిర్మించారు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఆది సరసన మిస్తీ చక్రవర్తి- నైరా షా నాయికలు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి సన్నివేశాల్ని ఎదుర్కొన్నాడు? అతడి ప్రేమకథ ఏ కంచికి చేరుకుంది? అన్నదే సినిమా కథాంశం.