Begin typing your search above and press return to search.
తాగుబోతుని కాదంటున్న 'సైరా' రైటర్
By: Tupaki Desk | 12 May 2018 1:30 AM GMTఫిల్మ్ ఇండస్ట్రీలో నిప్పులేకుండానే పొగ రాజేస్తారు. అలాంటిది చిన్న నిప్పు కణిక ఉందని తెలిస్తే ఇక ఊరుకుంటారా? ఇప్పుడదే జరిగింది. ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఆల్కహాల్ తాగుతాడని ఎక్కువ మందికి తెలుసు. ఎవరు మొదలుపెట్టారో తెలియదు కానీ సాయి మాధవ్ నిత్యం తాగుతూనే ఉంటాడని.. మందుకు బానిస అయిపోయాడని ఆరోగ్యమంతా పాడుచేసుకుంటున్నాడని ఇలా ఏవేవో రూమర్లు వచ్చాయి. వాటన్నింటికీ సాయి మాధవ్ సమాధానం ఇలా చెప్పాడు.
అవును నేను తాగుతాను. కానీ అందరూ అనుకుంటున్నట్టు 24 గంటలూ తాగను. రాత్రి 8 దాటాకా మాత్రం చుక్క పడాల్సిందే అని వివరించాడు సాయి మాధవ్. పగలంతా మాత్రం ఒక్క చుక్క కూడా తాగనని చెప్పాడు. అందరూ అనుకున్నట్టు తానేమీ తాగి తాగి ఆరోగ్యం పాడుచేసుకోవడం లేదని.. తాను పచ్చి తాగుబోతుని కానది క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో తన గురించి చెప్పుకుంటున్నవన్నీ వట్టి పుకార్లేనని అన్నాడు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమాకు పనిచేస్తున్నాడు. ఆ సినిమాతో పాటూ అనేక సినిమాలకు రైటర్ గా బిజీగా ఉన్నాడు. కోడి రామ్మూర్తి బయోపిక్ కు మోహన్ బాబు నటిస్తున్న కన్నప్ప సినిమాకు సాయిధరమ్ తేజ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాకు కూడా పనిచేస్తున్నట్టు చెప్పాడు. దీనిని చేతినిండా పనితో బిజీగానే ఉన్నాడు సాయి మాధవ్.
చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం 150 సినిమాకు రైటర్ సాయి మాధవే. గౌతమీ పుత్ర శాతకర్ణికి కూడా పనిచేశాడు. ఇవే కాదు ఎన్నో హిట్ సినిమాలకు పనిచేశాడు. అలాంటి వ్యక్తికి రోజూ ఆల్కహాల్ తాగే అలవాటు ఉండడంతో పుకార్లు రేగాయి. అన్నట్టు ఇతను త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నట్టు సమాచారం. గతంలో చాలా మంది రైటర్లు గా కెరీర్ మొదలుపెట్టి దర్శకులుగా మారిన వారే కదా. నా పేరు సూర్య సినిమా దర్శకుడు వక్కంతం వంశీ కూడా రైటరే కదా.