Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'బుర్రకథ'
By: Tupaki Desk | 6 July 2019 5:10 AM GMTచిత్రం : బుర్రకథ
నటీనటులు : ఆది సాయికుమార్ - మిస్తీ చక్రవర్తి - నైరా షా - రాజేంద్రప్రసాద్ - అభిమన్యు సింగ్ - పోసాని - పృథ్వి - ప్రభాస్ శీను - గాయత్రి గుప్తా - చమ్మక్ చంద్ర - రంగస్థలం మహేష్ - మణిచందన తదితరులు
సంగీతం - సాయి కార్తీక్
ఛాయాగ్రహణం : రాంప్రసాద్
ఎడిటింగ్ : ఎంఆర్ వర్మ
నిర్మాత : శ్రీకాంత్ దీపాల - కిషోర్
కథ - మాటలు - దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి మొదటి రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్నా ఆ తర్వాత వరస పరాజయాలతో రేస్ లో వెనుకబడ్డ ఆది హీరోగా రూపొందిన బుర్రకథ ఈ రోజు విడుదలైంది. హాస్య చిత్రాల రచయితగా పేరున్న డైమండ్ రత్నబాబు మొదటిసారి మెగా ఫోన్ చేతబట్టడం ప్రమోషన్ ద్వారా ఇందులో ఏదో వెరైటీ కంటెంట్ ఉందన్న ఇంప్రెషన్ కలిగించడం వెరసి బుర్రకథ మీద ఎంటర్ టైన్మెంట్ లవర్స్ ఎంతో కొంత ఆశించారు. మరి సక్సెస్ నే టార్గెట్ గా పెట్టుకుని వచ్చిన హీరో దర్శకుడి కాంబినేషన్ ఎంతవరకు వర్క్ అవుట్ అయ్యిందో రివ్యూలో చూద్దాం
కథ:
గణేష్ థియేటర్ మేనేజర్(రాజేంద్ర ప్రసాద్)ఏకైక సంతానం అభిరాం(ఆది సాయికుమార్). రెండు బుర్రలతో పుట్టడం వల్ల అభి పేరుతో జాలీగా కాసేపు రామ్ నామధేయంతో సాత్వికంగా మరికాసేపు ఉంటూ పెరిగి పెద్దవుతాడు. తన లక్షణాన్ని గుర్తించిన డాక్టర్ ప్రభుదాస్(పోసాని)కూతురు హ్యాపీ(మిస్తీ చక్రవర్తి)ని ప్రేమిస్తాడు అభి. రామ్ కు కూడా ఆశ్చర్య(నైరా షా)అనే లవర్ ఉంటుంది. అయితే ఈ రెండు బుర్రల వల్ల అభిరాంతో పాటు కుటుంబం కూడా ఇబ్బందులో పడుతూ ఉంటుంది. ఓ సంఘటన వల్ల దుర్మార్గుడైన గగన్ విహారి(అభిమన్యు సింగ్)నగర బహిష్కారం అయ్యేలా చేసి అతనికి శత్రువుగా మారతాడు అభి. ఇద్దరు ప్రియురాళ్లు రెండు కుటుంబాలు ఒక విలన్ వెరసి ఎన్నో మలుపులు తిరుగుతూ కథ కంచికి చేరడమే బుర్రకథ
కథనం - విశ్లేషణ:
తాను అనుకున్న ఆలోచనను తెరకెక్కించే క్రమంలో రచయితే దర్శకుడైతే చాలా వెసులుబాటు ఉంటుంది. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ దీంతో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో జంధ్యాల-త్రివిక్రమ్ లాంటివాళ్లు ఋజువు చేశారు. డీల్ చేయడంలో తడబడితే ఎంతటి దిగ్గజాలైనా పరాజయం ఎదురుకోక తప్పదని సత్యానంద్-పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళూ నిరూపించారు. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అందుకే డైరెక్టర్ గా డెబ్యూ చేసే విషయంలో రైటర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆది సాయికుమార్ లాంటి మార్కెట్ తక్కువగా ఉన్న హీరోతో రెగ్యులర్ ఎంటర్ టైనర్ చేస్తే ఎవరూ అంతగా పట్టించుకోరన్న ఆలోచనతోనే రత్నబాబు వెరైటీగా ఈ రెండు బుర్రల కథను ఎంచుకున్నాడు. బేసిక్ ప్లాట్ ను ఆసక్తికరంగానే తీసుకున్న రత్నబాబు దాన్ని ఆసక్తికరంగా విస్తరించుకోవడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. రెండు బుర్రలతో హీరో పాత్ర సంఘర్షణకు గురి కావడం అనే పాయింట్ లో మంచి డెప్త్ ఉంది. దానికి కావలసింది బలమైన కథనం. అది మిస్ కావడంతో ఇది కాస్తా బుర్రకు పరీక్ష పెట్టే ప్రహసనంగా మారింది
అభిరాం పాత్రను ఎస్టాబ్లిష్ చేయడమే తడబడుతూ మొదలుపెట్టిన రత్నబాబు కథను చెప్పే క్రమంలో నవ్విస్తే చాలు అనే రీతిలో ఎపిసోడ్లు రాసుకోవడంతో ఏ దశలోనూ బుర్రకథ ఆసక్తికరంగా అనిపించదు సరికదా దీని కన్నా టీవీలో వచ్చే కామెడీ షోలు చాలా నయం అనిపించే అభిప్రాయం కలగజేస్తాడు. తన సినిమాలో కామెడీ సెంటిమెంట్ ఎమోషన్స్ అన్ని ఉండాలన్న తపనతో ఏదో చేయబోయి ఇంకేదో చేసి ఫైనల్ గా మిక్సీలో వేసి చెడగొట్టేశారు.
విలన్ కాసేపు సీరియస్ గా ఉంటాడు. అంతలోనే పరమ దుర్మార్గుడిగా బిల్డప్ ఇస్తాడు. ఇదేంటి అనుకునే లోపే కమెడియన్ల కన్నా దారుణంగా ప్రవర్తిస్తాడు. కృష్ణ నెంబర్ వన్ సినిమాలో విలన్ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తున్నా హాస్యాన్ని హింసని బాలన్స్ చేయలేక గగన్ విహారి క్యారెక్టర్ ని నవ్వుల పాలు చేశాడు దర్శకుడు. రెండో హీరొయిన్ తో లవ్ ట్రాక్ కూడా ఇలాగే తలాతోకా లేకుండా ముగించడం లాంటి లోపాలన్నో బుర్రకథకు అడుగడుగునా రాళ్ళలా అడ్డుపడ్డాయి.
ఇలాంటి ఫాంటసీ ఎలిమెంట్ ఉన్న సినిమాల్లో లాజిక్ తో పెద్దగా పనుండదు. అలా అని ప్రేక్షకుల విచక్షణను మరీ చులకనగా అంచనా వేస్తే అసలుకే మోసం వస్తుంది. బుర్రకథలో జరిగింది అదే. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో ముందు హీరో శరీరం నుంచి అభి బుర్రను వేరు చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు అసలు ఎంత పెద్ద డాక్టర్ అయినా లోపల ఉన్న రెండు బుర్రల్లో ఎవరిది ఏ బుర్రో ఎలా గుర్తుపడతాడో దీన్ని స్క్రీన్ ప్లే రాసిన నాలుగురైదుగరు రచయితలే చెప్పాలి. ఈ ఆలోచన ప్రేక్షకుడికి వచ్చాక అటుపై జరిగే సెంటిమెంట్ డ్రామా ఎమోషనల్ గా లేకపోగా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసేలా చేస్తుంది. చాలా చిన్న లైన్ మీద మెదడుకు పని చెప్పకుండా సోషల్ మీడియా ట్రెండ్స్ నే కామెడీ కోసం వాడుకున్న తీరు సీన్స్ వల్ల కాక బుర్రకథ టీమ్ ఆలోచనలకు నవ్వు తెప్పిస్తుంది
ఇదంతా ఓకే ఎత్తు అయితే అవసరం ఉన్నా లేకపోయినా స్టార్ హీరోల సినిమాల బిట్లు స్పూఫ్ లను వాడుకోవడం వాళ్ళ డైలాగులను పాత్రల ద్వారా చెప్పించడం ఎప్పుడో అరిగిపోయిన ఫార్ములా. ఇది రిపీట్ చేయడం వల్లే అల్లరి నరేష్ కెరీర్ ని డేంజర్ లో వేసుకున్నాడు. అలాంటిది ఇంత సిల్లీగా వీటిని తెరకెక్కించాలన్న ఆలోచన వచ్చినందుకు రత్నబాబే బాధ్యత వహించాలి. ఆది సాయికుమార్ లాంటి ఇమేజ్ లేని హీరోతో డెబ్యూ చేస్తున్నప్పుడు ఎక్స్ ట్రాడినరీ కంటెంట్ ఉంటే తప్ప జనం మెచ్చరు. ఇంత లైటర్ వీన్ అప్రోచ్ లో కామెడీ ప్లస్ సెంటిమెంట్ ని ఖంగాళీ చేస్తూ తీస్తే ఎలా ఆడుతుందో దీన్ని స్క్రిప్ట్ దశలోనే ఒకటికి రెండు సార్లు చదివితే అర్థమయ్యేదేమో. తండ్రి పాత్ర ఎంతసేపు అభి ఎవరు రామ్ ఎవరు అంటూ పడే గందరగోళంలో బలయ్యేది ప్రేక్షకులే
సెకండ్ హీరోయిన్ ట్రాక్ మరీ ఆర్టిఫీషియల్ గా ఉంది. లేడీ విజయ్ దేవరకొండ అంటూ తనతో హీరోకి పదే పదే ముద్దులు పెట్టించడంలో క్రియేటివిటీకి కాసేపు మన బుర్ర పనిచేయదు. అమ్మాయిలంతా హీరో మీద పాడుతూ పాడే సుజనా పాట- చమ్మక్ చంద్ర ప్రాస్టిట్యూట్ కామెడీ - క్లైమాక్స్ లో విలన్ గ్యాంగ్ చేసే పేరడి సాంగ్ కామెడీ చెప్పుకుంటూ పోతే చాలా ఆణిముత్యాలు ఉన్నాయి ఇందులో. అభిరాం పాత్ర ఔచిత్యాన్ని సగానికి పైగా బాలన్స్ గా చూపించిన రత్నబాబు కేవలం మెలోడ్రమా కోసం రామ్ పాత్రతో పోసాని కూతురిని రేప్ చేయిస్తాను అని చెప్పించడం మరీ కృతకంగా ఉంది. ఇలాంటి బలహీనతల వల్లే ఎంత వద్దనుకున్నా ప్రేక్షకుడి బుర్ర లాజిక్స్ గురించి ఆలోచించేలా చేసింది. దాన్ని మరిపించే టెక్నిక్ ఒడిసిపట్టలేక రచయితగా దర్శకుడిగా రెండు పడవల ప్రయాణం చేయలేకపోయాడు రత్నబాబు
నటీనటులు:
ఆది సాయికుమార్ లో ఈతరం యూత్ హీరోలకు ఉండాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయి. కానీ కథలను ఎంచుకోడంలో చేస్తున్న పొరపాట్లు ఇన్నాళ్లు సక్సెస్ ని దూరంగా ఉంచేశాయి. సినిమా ఎలా ఉందన్న సంగతి కాసేపు పక్కనపెడితే ఆది కామెడీని పండించడంలో మంచి టైమింగ్ చూపించడంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో తనదైన మార్క్ చూపించాడు. ఇంకొంత సానబెడితే హీరోగా సెటిలయ్యే ఛాన్స్ ఉంది కానీ అందుకు తగ్గ సబ్జెక్టులే దొరకడం లేదు. బుర్రకథ కూడా అతని ఆశలు నెరవేర్చే ఛాన్స్ లేనట్టే. హీరోయిన్లలో మిస్తీ చక్రవర్తి కొంత నయం. లుక్స్ పరంగా బాగానే ఉంది. నైరా షా సౌండ్ ఎక్కువ యాక్టింగ్ తక్కువ
హీరో తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ తనను అలవాటైన శైలిలో అలా చేసుకుంటూ పోయారు. కొత్తగా ఆయనలో షేడ్స్ తెచ్చే పాత్ర కాదు కాబట్టి రొటీన్ గానే అనిపించినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలామటుకు వీక్ ఉన్న సీన్స్ ని చూసేలా చేసిన మాట వాస్తవం. అభిమన్యు సింగ్ యథావిధిగా అతి చాలా ఎక్కువ అనిపించే రోల్ లో చెలరేగిపోయాడు. కమెడియన్స్ నెంబర్ పరంగా ఉన్నారు కానీ ఎవరికీ ఎక్కువ స్పాన్ దక్కలేదు. హీరో తల్లిగా మణిచందన ఉత్సవ విగ్రహం అంతే. 30 ఇయర్స్ పృథ్వి కూడా హెల్ప్ లెస్ గా మిగిలిపోయాడు. చమ్మక్ చంద్ర తదితరులు బట్టీపట్టినట్టు ఏదో చెప్పుకుంటూ చేసుకుంటూ పోయారు తప్ప బయటికి వచ్చాక ఎవరూ గుర్తుండరు
సాంకేతిక వర్గం:
దర్శకుడిగా డైమండ్ రత్నబాబు ఎంచుకున్న పాయింట్ లో వైవిధ్యం ఉంది కానీ అది ట్రీట్ మెంట్ లో పూర్తిగా మిస్ కావడంతో బుర్రకథ మిస్ ఫైర్ గా నిలిచింది. హాస్యమంటే ఫేస్ బుక్ లో ట్రెండింగ్ అయ్యే టాపిక్స్ ని తీసుకుని సోషల్ మీడియాలో కనిపించే జోకులను మిక్స్ చేసుకుని దానికి రెండు బుర్రలు అనే థీమ్ ని జోడించినంత మాత్రాన ప్రేక్షకులు అబ్బో అని నవ్వుకునే సీన్ లేదు. అవకాశం ఉన్న చోట కూడా బేసిక్ కామెడీని కూడా పండించలేక బుర్రకథను నీరసంగా మార్చేశాడు రత్నబాబు. కేవలం కొందరు ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ట్రాక్స్ ని జత చేసినట్టు ఉంది తప్ప ఏదీ బలంగా లేకపోవడంతో బుర్రకథకు ప్రతి అంశం బలహీనతగా మారింది.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తనవంతు ప్రయత్నం బాగానే చేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత వరకు నయం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక డ్యూయెట్ తప్ప ఇంకే పాట కనీసం గుర్తుచేసుకుని స్థాయిలో లేకపోవడం అతని తప్పిదమే. రామ్ ప్రసాద్ సీనియారిటీ వల్ల ఛాయాగ్రహణం పుణ్యమాని బుర్రకథకు కొంత రిచ్ లుక్ వచ్చింది కానీ లేదంటే సీన్ ఇంకోలా ఉండేది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ కూడా చాలా పనిని తప్పించుకుంది. రెండున్నర గంటలు కూడా లేని సినిమా చాలా ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ కలిగిందంటే సెకండ్ హాఫ్ లో వచ్చే డ్రామాను అలాగే ఉంచడం వల్ల. ప్రొడక్షన్ వాల్యూస్ లోగా ఉన్నాయి. అవుట్ డోర్ లో తీసిన పాటలను మినహాయిస్తే విపరీతంగా రాజీ పడటం చాలా చోట్ల కనిపిస్తుంది. ఆది మార్కెట్ మీద భయంతో రిస్క్ చేయలేదో లేక ఈ కథకు ఇదే చాలని అనుకున్నారో కానీ ఫైనల్ అవుట్ ఫుట్ మీద దీని ప్రభావం కనిపించింది
చివరిగా చెప్పాలంటే ఎంతటి హాస్య ప్రియులకైనా సహనానికి పరీక్ష పెట్టే బుర్రకథను ఓపిగ్గా భరిస్తే కొంతవరకు చూడొచ్చు కానీ అంతకు మించి ఏదైనా ఆశిస్తే మాత్రం ఆశాభంగం తప్పదు. ఇతర దర్శకులతో బలంగా పనిచేసిన రత్నబాబు కలం తన స్వంత సినిమాకు మొండికేయడం విషాదం. కాసేపు కామెడీ కాసేపు సెంటిమెంట్ కాసేపు యాక్షన్ కాసేపు హీరోయిజం ఇలా నవరసాలు జొప్పించాలని చూసిన దర్శకుడి ప్రయత్నం చివరికి నీరసం మాత్రమే మిగిల్చింది.
బుర్రకథ - బుర్ర లేని ఖంగాళీ కథ
రేటింగ్ : 1.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre