Begin typing your search above and press return to search.
టాప్ హీరోలకు ఏమాత్రం తగ్గనంటున్న 'లెజెండ్'..!
By: Tupaki Desk | 31 May 2022 3:07 AM GMT'డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు.. ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారు.. క్యాషే ఉంటే ఫేసుకు విలవొస్తుంది.. నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..' అని అక్కినేని నాగార్జున ఓ సినిమాలో పాడుకుంటారు. ఏ సందర్భంలో చెప్పినా ఇది అక్షర సత్యం అని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఈ కారణం చేతనే, హీరో మెటీరియల్ కాకపోయినా బ్యాగ్రౌండ్ మరియు బ్యాంక్ బ్యాలన్స్ ఉండటం వల్ల సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు ఎందరో ఉన్నారు.
ఈ విధంగానే అనేకమంది వ్యాపారవేత్తల పిల్లలు మరియు పెద్ద నిర్మాతల కొడుకులు హీరోలుగా మారడం చూస్తుంటాం. రాబడి వస్తుందా లేదా అనేది ఆలోచించకుండా డబ్బుంది కదా అని వారిపై కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఈ కోవలోనే ఇప్పుడు తమిళ బిజినెస్ మ్యాన్ శరవణన్ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు.
న్యూ శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళనాడులో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన ఆయన 'లెజెండ్ శరవణన్' గా పిలవబడుతున్నారు. నటన పై మక్కువతో తమ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ లో హీరోయిన్లతో కలసి నటిస్తుంటాడు. అప్పట్లో స్టార్ హీరోయిన్ హన్సికతో కలిసి 'లెజెండ్ శరవణ' స్టోర్స్ ప్రకటనలో కనిపించి బాగా ట్రోల్ కి గురయ్యాడు. అయితే ఇప్పుడు ''ది లెజెండ్'' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు ఈ బడ్డింగ్ హీరో.
భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ తో అగ్ర హీరోల చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ''ది లెజెండ్'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఊర్వశీ రౌతెలా - లక్ష్మీ రాయ్ హీరోయిన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. ప్రభు - నాజర్ - విజయ్ కుమార్ - లత - కోవైసరళ - యోగిబాబు వంటి పాపులర్ నటీనటులు ఇందులో ఇతర పాత్రలు పోషించారు.
లేటెస్టుగా ''ది లెజెండ్'' ట్రైలర్ రిలీజ్ అయింది. యూట్యూబ్ లో ఇప్పటికే 8 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ చూస్తుంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఇస్తున్నట్లు అర్థం అవుతోంది. రిచ్ విజువల్స్ - భారీ సెటప్పులు - అద్భుతమైన గ్రాఫిక్స్ మరియు కలర్ ఫుల్ స్టార్ క్యాస్టింగ్ కలబోసిన లెజెండ్ శరవణన్ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
తొలి సినిమాకే మొత్తం ప్రపంచాన్ని కాపాడే కథాంశాన్ని శరవణన్ ఎంచుకున్నట్లు అర్థం అవుతుంది. సాధారణంగా అగ్ర హీరోలు ఇలాంటి స్క్రిప్టుల్లో నటిస్తుంటారు. ఇప్పుడు టాప్ హీరోల రేంజ్ లోనే భారీ బడ్జెట్ తో లెజెండ్ మూవీని తెరకెక్కించారు. తన నడక మరియు స్టైలింగ్ లో శరవణన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను అనుకరించటానికి ప్రయత్నించాడు.
సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్ - మ్యూజిక్ కంపోజర్ హారిస్ జయరాజ్ - ఎడిటర్ రూబెన్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ ''ది లెజెండ్'' చిత్రానికి పనిచేశారు. జెడి - జెర్రీ దర్శకత్వం వహించారు. లెజెండ్ శరవణనే దీనికి నిర్మాత కావడంతో బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుక జరుగగా.. దీనికి పది మంది హీరోయిన్లు హాజరవటం విశేషం.
పూజా హెగ్డే - తమన్నా భాటియా - ఊర్వశి రౌటేలా - హన్సిక - శ్రీలీల - లక్ష్మీ రాయ్ - శ్రద్ధా శ్రీనాథ్ - డింపుల్ హయతి - యాషికా ఆనంద్ - నూపూర్ సనన్ వంటి హీరోయిన్లు లెజెండ్ శరవణన్ సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. ఇది స్టార్ హీరోలు కూడా చేయలేని ప్రమోషన్. అయితే శరవణన్ ప్రతి హీరోయిన్ కు చార్టర్డ్ ఫ్లైట్ టిక్కెట్ తో పాటు పారితోషికం కూడా ఇచ్చి తీసుకు వచ్చాడనే టాక్ ఉంది.
శరవణన్ తన 'ది లెజెండ్' కోసం డబ్బును నీళ్లలా కుమ్మరించాడని అనుకుంటున్నారు. డెబ్యూ మూవీతోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఖర్చు చేసిన పెట్టుబడి అంతా వెనక్కి వస్తుందా లేదా అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ - స్టార్ డమ్ ఉన్న హీరోలకే ఒక్కోసారి పెద్ద బడ్జెట్ లు వర్క్ అవుట్ అవడం లేదు. మరి వచ్చే నెలలో రిలీజ్ అయ్యే ఈ సినిమా లెజెండ్ శరవణన్ కి ఎలాంటి అనుభవాన్ని మిగుల్చుతుందో చూడాలి.