Begin typing your search above and press return to search.

మ‌జిలీ అమ్మాయి ఇన్నాళ్లు ఏమైపోయిందో కానీ

By:  Tupaki Desk   |   8 July 2021 5:30 AM GMT
మ‌జిలీ అమ్మాయి ఇన్నాళ్లు ఏమైపోయిందో కానీ
X
మ‌జిలీ చిత్రంలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించింది దివ్యాన్ష కౌశిక్. న‌టించిన తొలి సినిమాతోనే తెలుగు యువ‌త‌కు పిచ్చిగా న‌చ్చేసింది ఈ నార్త్ బ్యూటీ. చైత‌న్య ప్రేమికురాలిగా ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించింది. పెద‌వి ముద్దులు స‌హా వేడెక్కించే రొమాంటిక్ స‌న్నివేశాల్లో త‌నదైన‌ పెర్ఫామెన్స్ తో క‌ట్టి ప‌డేసింది. మ‌జిలీ ఘ‌న‌ విజ‌యంలో దివ్యాన్ష ఒక భాగం అన‌డంలో సందేహ‌మేం లేదు. స‌మంత ఓవైపు ఎంత అద్భుతంగా ఎమోష‌న‌ల్ గా న‌టించిందో దివ్యాన్ష అంతే బ్యూటిఫుల్ గా ల‌వ్ లీగా తెర‌పై నిండుత‌నం తెచ్చింది.

అయినా .. ఎందుక‌నో ఈ అమ్మ‌డికి తెలుగు చిత్ర‌సీమ‌లో ఆశించిన‌న్ని అవ‌కాశాలు రాలేదు. విజ‌యం ద‌క్కినా బ్యాక్ టు బ్యాక్ సంత‌కాలు చేయ‌లేదు. ఇటీవ‌ల ఈ బ్యూటీ హైద‌రాబాద్ ని వ‌దిలి చెన్నై కి షిప్ట్ అయిపోయింద‌ని ప్ర‌చార‌మైంది. త‌మిళంలో సిద్ధార్థ్ స‌ర‌స‌న `ట‌క్క‌ర్` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా విజ‌యం సాధిస్తే త‌న‌కు కోలీవుడ్ కెరీర్ బావుంటుంద‌ని ఆశిస్తోంద‌ట‌.

ఇక‌పోతే ఇంత‌లోనే దివ్యాన్ష స‌డెన్ గా మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న న‌టిస్తూ షాకిచ్చింది. రవితేజ - దివ్యన్షా కౌశిక్ కొత్త చిత్రం షూటింగ్ ను ఆంధ్రప్రదేశ్ లోని పాపుల‌ర్ హిల్ స్టేషన్ అయిన హార్సిలీహిల్స్‌లో ప్రారంభించారు. ఓ వైపు చిట‌ప‌ట చినుకులు ప‌డుతుంటే మ‌రోవైపు ఈ చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో మాస్ రాజా చెలిక‌త్తెతో వేడెక్కించేస్తున్నారు. హ‌ర్షిలీ హిల్స్ గిలిగింత‌ల వెద‌ర్ లో దివ్యాన్ష‌ను అలా కౌగిలించుకుని ఎంత చ‌క్క‌గా రొమాన్స్ చేస్తున్నారో రాజా! స‌రైన టైమింగుతో ఈ జంట‌పై ద‌ర్శ‌కుడు కొన్ని వేడెక్కించే రొమాంటిక్ సన్నివేశాలను తీస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో రవితేజ ఒక మండల రెవెన్యూ అధికారిగా క‌నిపిస్తార‌ని స‌మాచారం. చిత్తూరు నేపథ్యంలో ఆద్యంతం సోసియో పొలిటిక‌ల్ క‌థాంశంతో సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.