Begin typing your search above and press return to search.
బుట్ట బొమ్మ కొత్త పేరు ధనలక్ష్మి హెగ్డే?
By: Tupaki Desk | 14 Jun 2021 4:48 AM GMTలాక్ డౌన్ సీజన్ ని బహుశా పూజా హెగ్డే ఎంజాయ్ చేసినంతగా వేరొకరు ఆస్వాధించలేరేమో! ఇటీవలి కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో తన సొంత నగరం ముంబైలో వర్షాలు ప్రకృతి గురించి పోస్ట్ చేసింది. వర్షంలో తడిసిముద్దయిన ముంబై నగరానికి సంబంధించి.. ఆమె ఇంటి నుండి పలు చిన్న వీడియోలను పోస్ట్ చేసింది. అవన్నీ అభిమానుల్లో వైరల్ అయ్యాయి. తాజాగా తమ ఇంటి పెరడుకు మరో మొక్క వచ్చి చేరిందని తెలిపింది. సరికొత్త ప్లాంట్ కి పేరు పెట్టమని పూజా తన అభిమానులను కోరింది. దానికి కొన్ని చమత్కారమైన సమాధానాలు అభిమానుల నుంచి వినవచ్చాయి.
మొక్కల నామకరణ సూచనల్లో భాగంగా ఫ్యాన్స్ రకరకాల పేర్లను సూచించారు. అల్లు అర్జున్ సరసన నటించిన 2020 తెలుగు బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో నుండి `బుట్టబోమ్మ` సాంగ్ ని గుర్తు చేసి ఈ పేరు పెట్టుకోమని సూచించారు. ఈ సమాధానానికి పూజా తనను తాను కెమెరా వద్ద అందంగా నటిస్తున్న బూమరాంగ్ వీడియోతో సమాధానం ఇచ్చింది. ఆమె తన వైపు చూపిస్తూ ``ఇంట్లో ఒక బుట్టబొమ్మ ఇప్పటికే ఉంది`` అని చెప్పింది. నవ్వుతున్న ఎమోజీని జోడించింది.
గోగో -గ్రూట్ -ధన్లక్ష్మి అంటూ రకరకాల పేర్లను అభిమానులు సూచించారు. గ్రూట్ మార్వెల్ సినిమాల నుండి చెట్టు లాంటి పాత్ర. అయితే తనకు ఇష్టమైన `లక్ష్మి` అని పేరు పెట్టేసానని పూజా వెల్లడించింది. తన మొక్క పేరు లక్ష్మి కాబట్టి తన పేరు ధనలక్ష్మి అయితే బావుంటుందేమో! బుట్టబొమ్మ కాకపోతే తనకు ధనలక్ష్మీ అని పిలిపించుకోవడం ఇష్టం అని పూజా చెప్పకనే చెప్పింది. ఇకపై తనని ధనలక్ష్మి హెగ్డే అని పిలిచేసినా తప్పేమీ కాదు. బాలీవుడ్ లోనూ ధనలక్ష్మీ హెగ్దే పేరు మార్చేసుకుంటే బావుంటుందేమో!!