Begin typing your search above and press return to search.
అరుదైన రికార్డును అందుకున్న 'బుట్టబొమ్మ'
By: Tupaki Desk | 14 Nov 2021 5:34 AM GMTఒక పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయి .. జనాలను థియేటర్లకు రప్పించేలా చేయడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి మేజిక్ 'అల వైకుంఠపురములో' సినిమా విషయంలో జరిగింది. 'బుట్టబొమ్మా .. బుట్టబొమ్మా' అంటూ సాగే ఈ పాట పట్నాల నుంచి పల్లెలవరకూ ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను టచ్ చేస్తూ వెళ్లింది. పిల్లల నుంచి పెద్దల వరకూ పలకరిస్తూ వెళ్లింది. ముఖ్యంగా ఈ బీట్ చిన్నపిల్లల మనసులను కూడా దోసిట పట్టేసింది. అంతలా ప్రభావితం చేసిన ఈ పాట .. వ్యూస్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ వెళుతోంది.
ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ ఇంకా తన జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఇంతవరకూ ఈ సాంగ్ 700 మిలియన్ వ్యూస్ ను సాధించినట్టుగా, ఈ పాటను పాడిన ఆర్మాన్ మాలిక్ తెలియజేశాడు.
అల్లు అర్జున్ - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్ వారు నిర్మించిన ఈ సినిమా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ అల్లుకున్న బలమైన కథాకథనాలకు తమన్ తన సంగీతాన్ని జోడించాడు. ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఈ సినిమాలో అన్ని పాటలూ హిట్టే. కాకపోతే అగ్రతాబూలం 'బొట్టబొమ్మ' అందుకుంది.
ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా .. ఆర్మాన్ మాలిక్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్స్ కొత్తగా కనిపిస్తాయి .. గమ్మత్తుగా అనిపిస్తాయి. ఈ పాట కోసం వేసిన సెట్ .. వాడిన కాస్ట్యూమ్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరిన పాట ఇది. అందువల్లనే ఈ స్థాయి ఆదరణ పొందగలిగింది. సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నా ఇంకా జనం నాలుకలపై ఈ పాట నానుతోంది. రాజేంద్ర ప్రసాద్ .. మురళీశర్మ .. జయరామ్ .. సుశాంత్ .. టబు .. నివేదా పేతురాజ్ ఈ సినిమా సక్సెస్ లో పాలుపంచుకున్నారు.
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ కలిసిన కథ ఇది. ఒక గొప్పింటికీ .. ఒక మధ్య తరగతి కుంబానికి మధ్య నడిచే కథ ఇది. పాత్రలు పరిమితంగానే కనిపించినా, ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం ఉంటుంది. అందువల్లనే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి ముందు బన్నీ చేసిన ' నా పేరు సూర్య' ఫ్లాప్ అయింది. అప్పుడు ఆయన తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో త్రివిక్రమ్ కోసం వెయిట్ చేసి మరీ చేసిన సినిమా ఇది. ఆయన నిరీక్షణకు తగిన ఫలితాన్ని ఇచ్చిన సినిమా ఇది .. తగిన గుర్తింపును తెచ్చిన పాట ఇది.