Begin typing your search above and press return to search.

ఏడాది గడిచినా ఆగని 'బుట్టబొమ్మ' రికార్డులు..!!

By:  Tupaki Desk   |   7 Jan 2021 1:46 PM GMT
ఏడాది గడిచినా ఆగని బుట్టబొమ్మ రికార్డులు..!!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ సినిమా “అల వైకుంఠపురంలో”. ఈ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై థియేటర్లలో కనక వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలతో పాటు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దాదాపు 150 కోట్లకు పైగా షేర్ రాబట్టి అల వైకుంఠపురంలో మూవీ ఔరా అనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఇక ఈ సినిమాలోని పాటలు మాత్రం ఓ రేంజిలో హిట్ అయ్యాయని చెప్పాలి. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఓటీటీ ఫ్లాట్‌‌ఫామ్‌లో కూడా ఈ సినిమా ప్రదర్శితమై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే 'అల వైకుంఠపురంలో' మ్యూజిక్ ఆల్బమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి అల వైకుంఠపురంలో మూవీ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

తాజాగా తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలో అన్ని బాషల వారికి పరిచయమయ్యాడు. గతేడాది విడుదలైన 'అల వైకుంఠపురంలో' ఆడియో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఇప్పటికే ఈ ఆడియో ఆల్బమ్ వివిధ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్ లలో రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాట మరో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో 500మిలియన్ల వ్యూస్ దగ్గరలో ఉన్న బుట్టబొమ్మ పాట ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన తెలుగు పాటగా రికార్డులోకెక్కింది. దీన్ని బట్టి ఇంకా 'అల వైకుంఠపురంలో' హవా ఆగిపోలేదని అర్ధమవుతుంది. ఇక తమన్ సంగీతం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ హవా అలా సాగిపోతుంది.