Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మ: మరోసారి మెప్పించిన థమన్
By: Tupaki Desk | 24 Dec 2019 11:55 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఈ సినిమానుండి బుట్టబొమ్మ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడనే సంగతి తెలిసిందే. బుట్టబొమ్మ పాటకు సాహిత్యం అందించినవారు రామజోగయ్య శాస్త్రి. పాడిన వారు అర్మాన్ మాలిక్. "ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్మో ఈ లవ్వనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము.. ముందునుంచి అందరన్న మాటే గానే మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్మో.. " అంటూ ప్రారంభమై.. "బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకొంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకొంటివే" అంటూ చాలా ఫన్నీగా సాగింది సాహిత్యం. బబుల్ గమ్ తో.. తుమ్ముతో ప్రేమను పోల్చడం వెరైటీగా ఉంది. ఫన్ మాత్రమే కాదు. "మాటగా ఓ మల్లె పువ్వునడిగితే మూటగా పూల తోటగా పైనోచ్చి పడితివే" లాంటి ఎక్స్ ప్రెషన్స చాలా అందంగా ఉన్నాయి. ఈ పాటకు మంచి ఫీల్ తో అర్మాన్ మాలిక్ పాడారు. సరదా సాహిత్యం.. క్యాచీ ట్యూన్.. ఫీల్ ఉన్న గానం ఈ పాటను హిట్ చేయడం ఖాయం.
థమన్ మరోసారి క్యాచీ ట్యూన్ తో సంగీత ప్రియులను మెప్పించాడు. అసలే సూపర్ ఫామ్ లో ఉన్న థమన్ ఈ పాటతో తన ఫామ్ ను కొనసాగించాడని అనుకోవాలి. 'జులాయి'.. 'S/o సత్యమూర్తి' లాంటి హిట్స్ తర్వాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆడియో మాత్రం అంచనాలను అందుకుంటోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అంతలోపు ఈ బుట్టబొమ్మను వినేయండి.