Begin typing your search above and press return to search.
ఆ సినిమా వల్ల నష్టపోయింది బయ్యర్లే కానీ.. నిర్మాతలు కాదు..!
By: Tupaki Desk | 10 Sep 2022 5:35 AM GMTపాండమిక్ తర్వాత ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ ను ఆదరిస్తున్నారు.. ఎటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి అనేది ఫిలిం మేకర్స్ అంచనా వేయలేకపోతున్నారు. అందుకే ఇటీవల కాలంలో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు డబుల్ డిజాస్టర్స్ గా నిలిస్తే.. తక్కువ ఎక్సపెక్టేషన్ తో వచ్చిన చిత్రాలు ఊహించని విజయాన్ని అందుకున్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలిస్తే.. ఆ ప్రాజెక్ట్ తో సంబంధం ఉన్న పార్టీలన్నీ తీవ్రంగా నష్టపోతుంటాయి. అయితే గత కొన్నేళ్లుగా నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడు పోతుండటంతో ప్రొడ్యూసర్స్ పెద్దగా నష్టపోవడం లేదు. కాకపోతే అధిక రేట్లకు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని తెలుస్తోంది.
అయితే నిర్మాతలు - బయ్యర్ల మధ్య సత్సంబంధాలు ఉండాలి కాబట్టి.. కొందరు తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత నష్ట పరిహారం చెల్లిస్తున్నారు. మరికొందరు మాత్రం తమ స్వలాభం చూసుకొని.. తమ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ ను పట్టించుకోవడం లేదు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ లో ఇటీవల ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కారణంగా బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దర్శక హీరోల కాంబినేషన్ మరియు సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎక్కువ రేట్లు పెట్టి తీసుకున్న వారందరూ నష్టాల పాలయ్యారు. అయితే వారిని ఆదుకోవడానికి నిర్మాత ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది.
స్టార్ డైరెక్టర్ మరియు యంగ్ హీరో కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ లో సినిమా గురించి ఊదర గొట్టడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. దీంతో థియేట్రికల్ రైట్స్ మంచి రేట్లకు అమ్ముడయ్యాయి. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో నిర్మాతలు ఘోరంగా నష్టపోయారని.. హీరో తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని తిరిగివ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అసలు నిజమేంటంటే.. ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ కు ఎలాంటి నష్టం లేదట. కొంత మేర లాభాల్లోనే ఉన్నారట. శాటిలైట్ హక్కులు మరియు డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తాన్ని వెనకేసుకున్నారని అంటున్నారు.
ఈ సినిమాతో నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉంటే.. బయ్యర్లు మాత్రం భారీగా నష్టపోతున్నారని తెలుస్తోంది. దీంతో నష్టపరిహారం కోసం ప్రొడ్యూసర్స్ ను ఆశ్రయిస్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్స్ కి ఎలాంటి సెటిల్మెంట్స్ చేయలేదని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.
అంతేకాదు అదే బ్యానర్ లో ఇంతకముందు వచ్చిన సినిమాకు ఓవర్ ఫ్లోస్ ఇవ్వడంలో విఫలమైన బయ్యర్స్ కు డబ్బు తిరిగి ఇవ్వడానికి సదరు నిర్మాత ఇష్టపడటం లేదని టాక్ వినిపిస్తోంది. మరి త్వరలో ఈ సెటిల్ మెంట్ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.