Begin typing your search above and press return to search.
కబాలి.. అంత క్రేజున్నా జంకుతున్నారు
By: Tupaki Desk | 13 July 2016 6:44 AM GMTబహుశా సౌత్ ఇండియాలో ప్రస్తుతం ‘కబాలి’ సినిమాకున్న క్రేజ్.. హైప్ ఇండియాలో ఇంతవరకు ఏ సినిమాకూ లేదంటే అతిశయోక్తి ఏమీ లేదు. మే 1న విడుదలైన ‘కబాలి’ టీజర్ ఏ స్థాయిలో ప్రకంపనలు రేపిందో.. ఈ సినిమా మీద అంచనాల్ని ఏ స్థాయికి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి సినిమాకూ హైప్ ఉంటుంది కానీ.. ‘కబాలి’ విషయంలో మాత్రం హైప్ మరీ హైలెవెల్లో ఉంది. ఈ సినిమాకు కనీ వినీ ఎరుగని స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాపై అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి.
ఐతే ‘కబాలి’ మీద తెలుగునాట ఎంత హైప్ ఉన్నప్పటికీ బయ్యర్లు గుడ్డిగా సినిమాను కొనేయట్లేదని సమాచారం. ఈ సినిమాను నిర్మాతలు.. ప్రతి ఏరియాకూ రజినీ సినిమాల్లో రికార్డు రేటుకు సినిమాను అమ్మాలని చూస్తున్నారు. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈజీగా బయ్యర్లు లాభాల బాట పట్టే అవకాశం ఉన్నప్పటికీ గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని బయ్యర్లు సినిమాను కొనే విషయంలో ముందు వెనుక ఆలోచిస్తున్నారట.
నైజాం ఏరియాకు రూ.10 కోట్ల రేటు పెడితే.. కొనడానికి బయ్యర్లు ముందుకు రావట్లేదట. మన స్టార్ హీరోల సినిమాలకు నైజాం ఏరియాకు రూ.15-20 కోట్ల మధ్య రేట్లు పలుకుతున్నాయి. దాంతో పోలిస్తే రజినీకాంత్ సినిమాకు రూ.10 కోట్లు పెట్టడం పెద్ద రిస్కేమీ కాదు. ‘కబాలి’ మీద అంచనాల ప్రకారం ఈ సినిమాకు ఆ రేటు పెట్టేయొచ్చు. కానీ బయ్యర్లు జంకుతున్నారు. ‘లింగా’ సినిమాను నమ్ముకుని నిండా మునిగిన నేపథ్యంలో బయ్యర్లు ధైర్యం చేయట్లేదు. ఐతే ‘కబాలి’కి అల్లు అరవింద్ సపోర్టుందని వార్తలొస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలకు ఒకట్రెండు రోజుల్లో బిజినెస్ క్లోజ్ చేయడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?