Begin typing your search above and press return to search.
2.0.. రిలీజ్ చేస్తారా? చెయ్యరా?
By: Tupaki Desk | 11 Jun 2018 6:14 AM GMTఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రం 2.0. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచుస్టున్నారు. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ - అమీ జాక్సన్ వంటి స్టార్స్ తో శంకర్ సృష్టించిన విజువల్ వండర్ ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. VFX ప్రధానాంశం కావడంతో సమయం ఎక్కువ పడుతుంది అంటే అందరు ఓకేలే అనుకున్నారు.
కానీ రిలీజ్ చేస్తామని ఒక ఏడాది నుంచి చిత్ర యూనిట్ అభిమానుల ఓపికకు పరిక్షపెడుతోంది. ఫైనల్ గా సమ్మర్ లో వస్తుంది అనుకుంటే ఆగస్ట్ - సెప్టెంబర్ అనేశారు. ఇక ఇప్పుడు అది కూడా కాదు అని వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయక తప్పదని చెబుతున్నారు. అభిమానుల సంగతి అటుంచితే.. ఈ సినిమా హక్కులను కొన్న బయ్యర్స్ పరిస్థితి వర్ణనాతీతం. ముందే అడ్వాన్స్ లు ఇచ్చి రైట్స్ అందుకున్నారు. ఎక్కువ ఖర్చు పెట్టి కొన్న వారు వడ్డీలకు తెచ్చి మరి అడ్వాన్స్ ఇచ్చారు. రిలీజ్ చేస్తే ఒక్క రోజుల్లోనే పికప్ అవ్వాలని వారి ప్లాన్ లో వాళ్లు ఉన్నారు.
కానీ శంకర్ ఆలోచన మాత్రం ఎండ్ అవ్వడం లేదు. గ్రాఫిక్స్ పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. అవి ఒక దశకు వచ్చే వరకు దర్శకుడు రిలీజ్ చెయ్యకూడదని నిర్మాతలకు గట్టిగా చెప్పేస్తున్నాడు. ఇప్పటికే 450 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన లైకా ప్రొడక్షన్ మరింత ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బయ్యర్స్ నుండి ప్రొడక్షన్ ఆఫీస్ కు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అసలు సినిమా రిలీజ్ ఉంటుందా ఉండదా?.. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని వాళ్లు కూడా గట్టిగా చెప్పేస్తున్నారట. దీంతో నిర్మాత వాళ్లకు నచ్చజెప్పి కవర్ చేస్తున్నట్లు సమాచారం.