Begin typing your search above and press return to search.
బాలకృష్ణ, రవితేజల మధ్య నిజంగానే గొడవ లేదండీ బాబూ!
By: Tupaki Desk | 24 Jan 2022 11:38 AM GMT'ఆహా'లో బాలకృష్ణ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకి స్క్రిప్ట్ పరంగా బీవీఎస్ రవి పార్టిసిపేషన్ ఉంది. ఇంతవరకూ జరుగుతూ వచ్చిన ఈ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ పై ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది. అలాగే అక్కడ స్టేజ్ పై జరుగుతూ వచ్చిన అన్ని విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చినవాడాయన. ఇటీవల 'అన్ స్టాపబుల్' షోకి రవితేజ వచ్చిన సంగతి తెలిసిందే. బాలకృష్ణకి .. రవితేజకి మధ్య ఒక కథానాయిక కారణంగా గొడవ జరిగిందనీ, అందువలన ఇద్దరి మధ్య మాటలు లేవనే ప్రచారం కొంతకాలం క్రితం జరిగింది. అదంతా పుకారు మాత్రమేనంటూ ఈ వేదిక ద్వారా ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.
తాజా ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి పాల్గొనగా, బాలకృష్ణ - రవితేజ ఇచ్చిన క్లారిటీతో నిజం ఎంత? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు బీవీఎస్ రవి స్పందిస్తూ .. "రవితేజతో నాకు 20 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. రెండు రోజులకొకసారి ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. అంత చనువుగా ఉండే నాకే తెలియలేదంటే అది జరగలేదని అర్థం. బాలకృష్ణగారిని రవితేజ ఈ మధ్యలో మూడు నాలుగుసార్లు కలిశాడు. ఒకసారి వజ్రోత్సవం ఫంక్షన్ కీ .. ఒకసారి ఇద్దరూ షూటింగు కోసం యూరప్ వెళుతూ ఫ్లైట్ లో కలుసుకున్నారు. చిరంజీవి గారి 60 వ బర్త్ డే ఫంక్షన్ లో మరోసారి కలిశాడు.
బాలకృష్ణ - రవితేజ మధ్య గొడవజరిగినట్టు 2004 లోనో .. 2005 లోనో చెప్పుకున్నారు. కానీ చిరంజీవి గారి ఫంక్షన్లో బాలకృష్ణ .. రవితేజ కలుసుకున్నది 2015లో. ఆ ఫంక్షన్లో మేమంతా కలిసి చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము. అప్పట్లో మీరన్నట్టుగా అక్కడ గొడవ జరిగితే, ఇక్కడ ఈ వాతావరణం ఉండేది కాదు. మేము రవితేజ గారిని 'ఆహా' ప్రోగ్రామ్ కి పిలవాలని అనుకున్నప్పుడు, ఆ విషయం లీకైంది. ఆ కార్యక్రమానికి రవితేజ రాడనీ .. బాలకృష్ణ రానీయడనీ .. ఒకవేళ వచ్చినా ఎపిసోడ్ పొడిపొడిగా ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
కానీ నిజానికి రవితేజ ప్రస్తావన రాగానే 'రవికి నేను కాల్ చేయనా .. ఆయన నెంబర్ నా దగ్గర ఉంది?' అని బాలయ్య అన్నారు. రవితేజతో నేను ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాను. అప్పుడు ఆయన " నా షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది. ఆదివారాలు పనిచేయకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు పని చేయవలసి వస్తోంది" అన్నాడు. ఆయన రాకపోతే మళ్లీ అంతా వేరే రకంగా అనుకుంటారేమోనని నాకు అనిపించింది. అప్పుడు రవితేజ "బాలకృష్ణ గారు పిలిస్తే నేను తప్పకుండా రావలసిందే. అయితే ఎప్పుడు వస్తాననేది నేను చెబుతాను .. ఆ అవకాశం ఇవ్వండి" అన్నాడు. అలా అనుకున్నట్టుగానే వచ్చాడు .. ఆ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.