Begin typing your search above and press return to search.
నా దర్శకుడు, హీరో ఇంటర్నేషనల్ ఫేమస్
By: Tupaki Desk | 1 Oct 2015 11:30 AM GMTప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఛత్రపతి’ రిలీజై 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ చిత్రంతో మాస్ యాక్షన్ హీరోగా ప్రభాస్ కి - యాక్షన్ డైరెక్టర్ గా ఎస్.ఎస్.రాజమౌళికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇదే సినిమాతో నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ‘ఛత్రపతి’ ప్రసాద్ గా ఫేమస్ అయ్యారు. ‘ఛత్రపతి’ రిలీజై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఛత్రపతి ప్రసాద్’తో చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్....
*చత్రపతి సినిమా రిలీజై 10 సంవత్సరాలైంది. అంతకంటే ముందే 15 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నా. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినా, ఛత్రపతి సినిమాతో ప్రత్యేకించి గుర్తింపు దక్కింది. ఈ సినిమాతోనే ఛత్రపతి ప్రసాద్ గా పరిశ్రమలో పాపులర్ అయ్యాను. నా జీవితంలో మర్చిపోలేని సినిమా.
*ప్రభాస్ – రాజమౌళి కయికలో సినిమా చేయానుకున్నప్పుడు .. ముందుగా ప్రభాస్ ఈ కథ విని, బావుంది చేద్దామని అన్నాడు. తను కథని నమ్మాడు. మీ వెంట నేను ఉన్నా అంటూ ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళితో కలిసి ముందుకు వెళ్లాం. ఎస్.ఎస్.రాజమౌళి అప్పటికే సక్సెస్ ఫుల్ డైరెక్టర్. వరుసగా మూడు హిట్లున్నాయి. ఈరోజు నా దర్శకుడు - హీరో ఇంటర్ నేషనల్ ఫేమస్. బాహుబలి వంటి గొప్ప సినిమాని సినీపరిశ్రమకి అందించినందుకు ఆనందంగా ఉంది.
* చత్రపతి సినిమాతో యాక్షన్ హీరోగా ప్రభాస్ కి మాస్ లో ఇమేజ్ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా రిలీజై 10 ఏళ్లు అయినా ఇంకా గుర్తుండిపోయింది అంటే ప్రభాస్ నటన వల్లే.
* ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరిగింది. అది ఎప్పటికీ మర్చిపోలేనిది. సముద్రంలోకి భారీ క్రేన్ తో షూటింగ్… సముద్రం మధ్యలో షార్క్ తో సన్నివేశం.. పైగా అక్కడికి వెళ్లడంతో రిస్క్ అవుతుందేమోనని భయపడ్డాను.
* ఆ అవకాశం కోసం ఎంతో వేచి చూస్తున్నా. ప్రస్తుతం బాహుబలి 2 బిజీలో ఉన్నారు. రాజమౌళితో షూటింగ్ అంటే అది మెమరబుల్ గా ఉంటుంది. మరి మా కలయిక ఎప్పటికి కుదురుతుందో?
* ఛత్రపతి సినిమాతో ఎంతో పేరొచ్చింది. బుల్లితెరపై ఎప్పుడు ఈ సినిమా వేసినా వెంటనే ఫోన్లు వస్తుంటాయి. అలా ఫోన్ చేసి అడగడం మరపురాని అనుభూతినిస్తుంది.
*1984లో పరిశ్రమకి వచ్చాను. 1985లో శోభన్ బాబు హీరోగా ‘డ్రైవర్ బాబు’ సినిమా తీశాను. జనవరి 1986లో సినిమా రిలీజైంది. మొదట ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణగారితో తీయానుకున్నా, కాల్షీట్ల సమస్య వల్ల తర్వాత శోభన్ బాబుతో తెరకెక్కించాం. కెరీర్ తొలి సినిమానే చెప్పిన టైమ్ కి రిలీజ్ చేశాం ఆరోజుల్లో. అది మరువలేని అనుభూతినిచ్చింది.
* 1984 నుంచి 2005 వరకూ 15 సంవత్సరాల కాలం లో ఎన్నో సినిమాలు చేశాం. నేను పరిశ్రమలోకి వస్తూనే పెద్ద సినిమా చేశాను. శోభన్ బాబుతో ఆరోజుల్లోనే 40లక్షల్లో సినిమా అనుకుంటే బడ్జెట్ పరిధి మరో 10 నుంచి 20 లక్షలు పెరిగేది. అయినా అంత పెద్ద మొత్తం వసూళ్లు వచ్చేవి. అయితే ఛత్రపతి సినిమాని అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేయగలిగాం. టీమ్ తో ప్రతిదీ మాట్లాడడం వ్ల బడ్జెట్ పరిధి దాటకుండా అదుపులో పెట్టుకోగలిగాం. ఇటీవలి కాంలోనూ బడ్జెట్ విషయంలో ప్రణాళికతోనే ఉంటున్నారంతా. అనుకోనిది ఏదైనా జరిగితే తప్ప అదనపు ఖర్చు ఏమీ లేదు. లిమిటేషన్ క్రాస్ చెయ్యడం అనేదేం లేదు.
* ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో షూటింగ్ 70శాతం పూర్తయింది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో, శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాం. కథ డిమాండ్ మేరకు లండన్ - స్పెయిన్ లాంటి చోట తెరకెక్కిస్తున్నాం. ఈనెల 20 నుంచి స్పెయిన్ లో కొత్త షెడ్యూల్ మొదవుతోంది. ఎన్టీఆర్ అభిమానులకు ఇదో విజువల్ ట్రీట్ అవుతుంది.