Begin typing your search above and press return to search.

దిల్ రాజు వదిలేసింది.. ఆయన టేకప్ చేశాడా?

By:  Tupaki Desk   |   29 Jun 2016 1:30 PM GMT
దిల్ రాజు వదిలేసింది.. ఆయన టేకప్ చేశాడా?
X
‘కంచె’ తర్వాత వరుణ్ తేజ్ రేంజే మారిపోయేలా కనిపించింది. కానీ వరుణ్ వేసిన ఓ తప్పటడుగు అతడి కెరీర్‌ ను అయోమయంలోకి నెట్టేసింది. ‘కంచె’ సినిమాతో ఆకాశానికి నిచ్చెనలేస్తున్న వాడు.. ‘లోఫర్’ సినిమాతో పాతాళానికి పడిపోయాడు. ఈ ప్రభావం అతడి తర్వాతి సినిమాల మీదా పడింది. ‘లోఫర్’ రిలీజై ఏడెనిమిది నెలలైనా ఇప్పటిదాకా వరుణ్ తర్వాతి సినిమా మొదలే కాలేదు. రకరకాల ప్రాజెక్టులు తెరమీదికి వస్తున్నాయి. అవేవే కూడా కార్యరూపం దాల్చలేదు. క్రిష్‌ తో ‘రాయబారి’ పక్కకు వెళ్లిపోయింది. గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కలేదు. శ్రీను వైట్లతో ‘మిస్టర్’ డోలాయమానంలో ఉంది. వెంకీ అట్లూరి అనే యువ దర్శకుడితో చేయాల్సిన సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు.

వరుణ్-వెంకీ కాంబినేషన్లో ‘ఫీల్ మై లవ్’ పేరుతో ఓ సినిమా చేయాలని భావించాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఐతే అంతా ఓకే అనుకున్నాక ఈ ప్రాజెక్టు అనివార్య కారణాలతో ఆగిపోయింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించలేనని వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో ఇక ఈ సినిమా ఎప్పటికీ సెట్స్ మీదికి వెళ్లదనే అనుకున్నారంతా. ఐతే మరో అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఉన్నట్లుండి లైన్లోకి వచ్చాడు. ఆయనకు వెంకీ చెప్పిన కథ చాలా బాగా నచ్చేసి.. తనే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడట. ప్రస్తుతం వరుణ్ తేజ్ డేట్ల కోసం డిస్కషన్స్ నడుస్తున్నాయట. ‘మిస్టర్’ సినిమా డౌట్లో పడ్డాక వరుణ్.. రాబోయే కొన్ని నెలల డేట్లు శేఖర్ కమ్ములతో చేయాల్సిన సినిమాకు ఇచ్చేశాడు. ఐతే అందులో కొన్ని డేట్లు తన సినిమాకు అడుగుతున్నాడట ప్రసాద్. ఈ విషయంలో అంగీకారం కుదిరితే.. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లొచ్చు. వరుణ్ సమాంతరంగా ఈ రెండు సినిమాలనూ పూర్తి చేసే అవకాశముంది.