Begin typing your search above and press return to search.
పవన్ తో ఆ గొడవపై నిర్మాత స్పందించాడు
By: Tupaki Desk | 28 Dec 2016 5:30 PM GMTఈ ఏడాది ఆరంభంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించి తనకు బాకీ పడ్డ డబ్బుల కోసం నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మీద ఫిర్యాదు చేయడం పెద్ద సంచలనమే అయింది. దీనిపై పవన్ కానీ.. ప్రసాద్ కానీ.. అప్పుడు.. ఆ తర్వాత ఏం మాట్లాడలేదు. ఐతే తన నిర్మాణంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి ప్రసాద్.. ఈ విషయమై స్పందించాడు. ఆ డబ్బుల గొడవకు సంబంధించి పవన్ తప్పేమీ లేదని అన్నాడు. పవన్ తనను ఉద్దేశపూర్వకంగా ఏమీ ఇబ్బంది పెట్టలేదని చెప్పాడు.
‘‘నేను పవన్ కళ్యాణ్ గారికి కొంత అమౌంట్ ఇవ్వాలి. అది ఆలస్యమైంది. అయినా అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఆయన నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇబ్బంది పడ్డాను.. అంతే. అది ఎందుకు జరిగిందో కానీ జరిగిపోయింది. నేను ఆ సమయంలో అలాంటి పరిస్ధితిలో ఉండడం నా దురదృష్టం అనుకుంటున్నాను. ‘నాన్నకు ప్రేమతో రిలీజ్ సమయంలో దీని వల్ల ఇబ్బంది పడ్డానా అంటే.. అలాంటివి జరుగుతుంటాయి.. జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్లాలి’’ అని తెలుసుకున్నాను అని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తెలిపాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందు పైరసీ దెబ్బ తగిలినపుడు పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ ఎంతో సాయం చేశారని ఇదే ఇంటర్వ్యూలో ప్రసాద్ చెప్పడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/