Begin typing your search above and press return to search.

2022 కి కేజీఎఫ్‌ 2 నే నెం.1

By:  Tupaki Desk   |   20 Dec 2022 5:09 AM GMT
2022 కి కేజీఎఫ్‌ 2 నే నెం.1
X
2022 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. ఈ పది రోజుల్లో పెద్ద సినిమాలు.. భారీ బడ్జెట్‌ సినిమాలు వచ్చేవి ఏమీ లేవు. ఈ సమయంలో బుక్ మై షో వారు విడుదల చేసిన జాబితా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరంలో బుక్ మై షో ద్వారా కేజీఎఫ్ 2 సినిమా కు గాను ఎక్కువగా టికెట్లు బుక్‌ అయ్యాయట.

ఇప్పటికే కలెక్షన్స్ లో ఈ ఏడాదిలో టాప్ సినిమా గా నిలిచిన కేజీఎఫ్ 2 ఇప్పుడు బుక్ మై షో లో అత్యధిక టికెట్లు బుక్ అయిన సినిమా గా కూడా నిలిచింది. భారీ వసూళ్లను కేజీఎఫ్ 2 నమోదు చేసిందనే విషయం తెల్సిందే. అందులో మెజారిటీ వాటా బుక్ మై షో ద్వారా వచ్చినట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతోంది.

బుక్ మై షో వారు తెలిపిన వివరాల ప్రకారం కేజీఎఫ్ 2 కి 17.7 మిలియన్‌ ల టికెట్లు అమ్ముడు పోయాయి. కేజీఎఫ్ ను చూసిన వారిలో 17.7 మిలియన్‌ ల మంది బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూశారట. కేజీఎఫ్ 2 ను మొదటి రోజే చూసేందుకు బుక్ మై షో లో 2.14 మిలియన్‌ ల మంది టికెట్స్ ను బుక్ చేసుకున్నారట.

ఆన్ లైన్ టికెట్స్ బుకింగ్‌ అత్యధికంగా బుక్ మై షో లో జరుగుతూ ఉంటాయి. అలాంటి బుక్‌ మై షో లో 17.7 మంది కేజీఎఫ్ 2 కి టికెట్లు బుక్ చేయడం జరిగింది. ఈ ఏడాది సూపర్ హిట్ అయిన ఆర్ ఆర్ ఆర్‌.. విక్రమ్‌.. కాంతార సినిమాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

కేజీఎఫ్ 2 సినిమా కన్నడం తో పాటు అన్ని భాషల్లో కూడా అత్యధిక వసూళ్లు నమోదు చేసింది. హిందీ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసిన కేజీఎఫ్ 2 ఇప్పుడు బుక్ మై షో లో కూడా అత్యధిక టికెట్లు అమ్ముడు అయిన సినిమా గా నిలవడం జరిగింది. కలెక్షన్స్ విషయంలోనే కాకుండా బుక్ మై షో లో కూడా కేజీఎఫ్ నెం.1 గా నిలిచింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.