Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ పరువు పోయేలా ఉంది
By: Tupaki Desk | 20 Dec 2018 9:06 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ కు తమిళంలో ఏ స్థాయి క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆయనకు అభిమానులు ఉంటారు. రజినీకాంత్ తమిళంలో ఏ సినిమా చేసినా కూడా తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల అవుతూ వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా రజినీకాంత్ టాలీవుడ్ లో టాప్ స్టార్ గానే కొనసాగుతూ వస్తున్నాడు. రజినీకాంత్ మూవీ వస్తుందంటే అది డబ్బింగ్ అయినా సరే పెద్ద హీరో సినిమాలు కూడా వాయిదా పడేవి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది.
రజినీకాంత్ తాజాగా నటించిన ‘పెట్టా’ మూవీ తెలుగులో విడుదలకు పెద్ద కష్టం వచ్చింది. సంక్రాంతికి తమిళ వర్షన్ ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. కాని తెలుగులో మాత్రం సంక్రాంతికి విడుదల అయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే వినయ విధేయ రామ మరియు ఎన్టీఆర్ చిత్రాలతో పాటు ఎఫ్ 2 కోసం థియేటర్లను బ్లాక్ చేసేశారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతం థియేటర్లు ఆ మూడు సినిమాలతో సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ‘పెట్టా’ తెలుగు వర్షన్ సంక్రాంతికి విడుదల చేసేందుకు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న సి కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
‘పెట్టా’ విడుదల తేదీ ప్రకటించడానికి ముందే సంక్రాంతికి తెలుగు సినిమాలు థియేటర్లను బుక్ చేసుకున్న నేపథ్యంలో రజినీకాంత్ మూవీకి థియేటర్ల సమస్య. తక్కువ థియేటర్లలో విడుదల చేస్తే రజినీకాంత్ సినిమాను అవమానించినట్లే అని కొందరు - తమిళంతో పాటు తెలుగులో కూడా రజినీకాంత్ మూవీని విడుదల చేయలేక పోతే నిర్మాత అసమర్థత అంటూ విమర్శలు వస్తాయి. మొత్తానికి ‘పెట్టా’ మూవీ తెలుగులో విడుదల అయినా, కాకున్నా కూడా సూపర్ స్టార్ పరువు పోవడం మాత్రం పక్కా అనిపిస్తుంది. ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే ఈ పరిస్థితి అంటూ రజినీకాంత్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితి నుండి సి కళ్యాణ్ ఎలా బయట పడతాడో చూడాలి.