Begin typing your search above and press return to search.
చిన్న నిర్మాతలకు అండగా పెద్ద స్కెచ్
By: Tupaki Desk | 11 July 2019 6:24 AM GMTచిన్న నిర్మాతలకు పెద్ద బూస్ట్ ఇవ్వనున్నారా? అందుకు నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడు కొత్త గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. చిన్న సినిమాల మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. ``చిన్న చిత్రాల నిర్మాతల కోసం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఒక తుది నిర్ణయానికొస్తా``మని తాజాగా ఓ ఈవెంట్ లో సి.కళ్యాణ్ ప్రకటించారు. అయితే చిన్న సినిమాల అసలు సమస్యలేంటో తెలిస్తే వాటి పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. నిర్మాతల మండలి కొత్త మార్గ దర్శకాల రూపకల్పన చేయాలంటే చిత్తశుద్ధి అవసరమని పలువురు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసలు చిన్న సినిమాలకు సమస్యలేంటి? అంటే రెగ్యులర్ గా వినిపించేది `థియేటర్ల సమస్య`. సరిపడినన్ని థియేటర్లు ఇవ్వడం లేదని .. ఆ నలుగురు కబ్జాలోనే థియేటర్లు ఉన్నాయన్నది ప్రతి ఒక్కరూ చేసే ఆరోపణ. అలాగే థియేటర్లలో ఐదో ఆట డిమాండ్ ఎప్పటిదో .. ఇప్పటికైనా చిన్న నిర్మాతల ఆపద్భాందవుడినని చెప్పుకునే సి.కళ్యాణ్ ఆ దిశగా ఆలోచిస్తున్నారా? అన్నది ఇంపార్టెంట్. అలాగే చిన్న సినిమాకి టిక్కెట్టు ధర వెసులుబాటు ముఖ్యమే. ఇటీవల ప్రభుత్వ సవరణతో జీఎస్టీ బరువు కొంతవరకూ తగ్గిందని వార్తలొచ్చాయి. దానిని టిక్కెట్టుకు వర్తింపజేయాలి. అలాగే సింగిల్ విండో పై పూర్తి క్లారిటీ లేదు. వీటన్నిటి నుంచి రిలీఫ్ చిన్న సినిమా నిర్మాతలకు అత్యవసరం. క్యూబ్- యూఎఫ్ వో వంటి వాటి ధరల నియంత్రణ విషయంలోనూ కొత్త అధ్యక్షుడు చొరవ చూపాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సి.కళ్యాణ్ సహా పలువురు పెద్దలు టీఎస్-ఎఫ్ డీసీ రామ్మోహన్ తో కలిసి చిన్న సినిమా సమస్యలపై చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది.
షకలక శంకర్ నటించిన `కేడి నం.1` రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సి.కళ్యాణ్ చిన్న సినిమా మేలు కోరుతూ కొన్ని సూచనలు చేశారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ -``చిన్న సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బావుంటుంది. పది మందికి పని దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ తో వచ్చిన చిన్న చిత్రాలు బాగా ఆడుతూ మంచి వసూళ్లు సాధిస్తూ పెద్ద సినిమాల సరసన చేరుతున్నాయి. చిన్న చిత్రాల నిర్మాతలకు నేను చెప్పేది ఒకటే... మంచి కంటెంట్ తో సినిమా తీయండి. అది కూడా బడ్జెట్ పెరగకుండా చూసుకోండి. చిన్న చిత్రాల నిర్మాతల కోసం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఓ నిర్ణయానికొస్తాం. ఇక ఎంత మంచి సినిమా తీసినా మీడియానే జనాల్లోకి తీసుకెళుతుంది. చిన్న సినిమాలకు మంచి ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు. ఈనెల 26న రిలీజవుతున్న `నేనే కేడీ నెం-1` విజయం సాధించాలని ఆకాంక్షించారు.