Begin typing your search above and press return to search.

ఇండ‌స్ర్టీ బంద్ అట్ట‌ర్ ప్లాప్ షో అనేసిన సి.క‌ళ్యాణ్!

By:  Tupaki Desk   |   8 Dec 2022 11:30 AM GMT
ఇండ‌స్ర్టీ బంద్ అట్ట‌ర్ ప్లాప్ షో అనేసిన సి.క‌ళ్యాణ్!
X
ఆగ‌స్టులో ఇండ‌స్ర్టీ బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. 30 రోజుల పాటు షూటింగ్ లు స‌హా అన్ని ప‌నులు బంద్ చేసి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం దిశ‌గా క‌మిటీలు వేసారు. ఈ స‌మ్మెని నిర్మాత‌లంతా క‌లిసి స్వ‌చ్ఛందంగా తెర‌పైకి తెచ్చారు. హీరోల పారితోషి కాలు..కార్మిక వేత‌నాల విష‌యంపై జ‌రిగిన స‌మ్మెపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల అనంత‌రం తిరిగి పున ప్రారంభ‌మైంది. మ‌రి ఈ స‌మ్మె ఎలాంటి ఫ‌లితాలు  సాధించింది అంటే?  నిర్మాతల కౌన్సిల్ ప్రెసిడెంట్..నిర్మాత  సి.క‌ళ్యాణ్ ఇది ఓ అట్ట‌ర్ ప్లాప్ షో అని తేల్చేసారు.

ఓ ఇంటర్వ్యూలో  ఆయ‌న మాట్లాడుతూ..' ఇండస్ట్రీ స్ట్రైక్ అట్టర్ ఫ్లాప్ షో. ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. సమస్యలను గుర్తిస్తామని నిర్మాతలు పరిశ్రమను 30 రోజుల పాటు మూసివేశారు. మొదటి 4-5 సమావేశాల్లోనే అది ఎక్కడికీ వెళ్లదని నాకు తెలుసు. వారు ఖచ్చితమైన‌  సమస్యలను గుర్తించారు. కానీ సమ్మె తర్వాత రోజు ఏదీ అమలు కాలేదు.  సమయం వృధా త‌ప్ప ఒరిగిందేం లేదు.

'గిల్డ్ 100% అట్టర్ ఫ్లాప్ సంస్థ. ఆ సంస్థ‌ని అస్స‌లు ప‌ట్టించ‌కోం. ఇండస్ట్రీకి ఓ పెద్ద నిర్మాత‌ ఎప్పుడూ మేలు చేయలేదు. అతను తన సొంత వ్యాపారం చూసుకుంటాడు త‌ప్ప ప‌రిశ్ర‌మ స‌మస్య‌ల్ని ప‌ట్టించుకోడు.  మీడియా ముందు మాట్లాడేవ‌ని కేవ‌లం పైపై మాట‌లు మాత్ర‌మే. త‌ర్వాత అవి జ‌రిగాయా?  లేదా? అని ప‌ట్టించుకున పాపాన పోరు.

మ‌ళ్లీ ఆ నిర్మాత నిర్మాత‌ల‌ కౌన్సిల్‌లో చాలా పోస్ట్‌లలో ఉన్నాడు.  కానీ ఏమీ సహకరించలేదు. నిర్మాత‌లు స‌హా  కార్మికుల‌కు న‌ష్ట‌మే త‌ప్ప న్యాయం జ‌ర‌గ‌లేదు. ఇక్క‌డ ఎవ‌రూ శాశ్వ‌తం కాదు. ఈరోజు ఉన్న ప‌ద‌వి శాశ్వ‌తం కాదు.  పైకి వెళ్ళిన ప్రతి ఒక్క‌రి గ్రాఫ్ త‌ప్ప‌కుండా క్రిందికి వస్తుంది. మ‌నం ఎలాంటి ప‌ద‌వుల్లో ఉన్నా..లేక‌పోయినా ప‌రిశ్ర‌మ మ‌న‌ల్ని గుర్తించ‌డం ముఖ్యం. ఉన్నంత కాలం ఆర‌కంగా ప‌నిచేయాలి త‌ప్ప‌..సొంత ప‌నులు..వ్యాపారం దిశ‌గానే ప‌నిచేస్తే ప‌రిశ్ర‌మ ఎలా ముందుకెళ్తుంద‌ని' అభిప్రాయ‌ప‌డ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.