Begin typing your search above and press return to search.
చిరంజీవి రావట్లే.. బైట్ ఇస్తుండు!
By: Tupaki Desk | 3 Dec 2015 4:24 AM GMTవరుణ్ తేజ్ లోఫర్ ఈనెల 18న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందే ఈనెల 7న ఆడియో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆడియో వేదికపై ముఖ్య అతిధి ఎవరు? ప‌్రత్యేక ఆకర్షణ ఏంటి? అని ప్రశ్నిస్తే రకరకాల సందేహాలొచ్చేలా సమాధానం వినిపించింది అట్నుంచి.
అసలు మెగా హీరోల ఆడియో వేదికలకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందే. ఆ ఫ్యామిలీ హీరోలంతా వేదికపై కొలువు దీరాల్సిందే. ప్రతిసారీ ఏ హీరో అయినా ముందుగా వెళ్లి చిరంజీవిని ఆహ్వానించేవారు. అయితే ఈసారి వరుణ్ తేజ్ మెగాస్టార్ ని పిలిచిందే లేదు. పెదనాన్న లేకుండానే వరుణ్ తన సినిమా ఆడియో చేసుకోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అయినా ఎందుకిలా చేస్తున్నారు? ఇటీవలి కాలంలో 150వ సినిమా విషయంలో పూరి జగన్నాథ్- చిరంజీవి మధ్య నడిచిన ఎపిసోడ్ ఇబ్బంది పెట్టిందా? అందుకే చిరుని ఆడియోకి ఆహ్వానించలేదా? అన్న సందేహాలొస్తున్నాయి.
ఇదే ప్రశ్న నిర్మాత సి.కళ్యాణ్ ని అడిగితే .. `అలాంటిదేం లేదు. గతం గతః . ఆడియో వేడుకను ఈసారి డిఫరెంటుగా చేయాలనుకున్నాం. అందుకే మెగా ఫ్యామిలీ హీరోల్ని కాకుండా ప్రభాస్ ని ఆహ్వానించాం. మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ ని బ్లెస్ చేస్తూ ఓ బైట్ ఇచ్చారు` అంటూ చెప్పొకొచ్చారు. అంటే మెగా హీరోలు వస్తే డిఫరెంటుగా ఉండదా? ప‌్రభాస్ వస్తేనే డిఫరెంటా? బైట్ పంపిస్తేనే డిఫరెంటా గురూ?