Begin typing your search above and press return to search.
‘జై సింహా’పై అంత కాన్ఫిడెన్సా..
By: Tupaki Desk | 26 Dec 2017 10:28 AM GMTగత కొన్నేళ్ల నుంచి శరవేగంగా సినిమాలు చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ సినిమాను కూడా ఆరు నెలల్లో ముగించాడు నందమూరి హీరో. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ‘పైసా వసూల్’ మొదలుపెట్టి.. సెప్టెంబరు 1 కల్లా విడుదల చేయించేశాడు. ఆ సినిమా పూర్తవగానే ‘జై సింహా’ మొదలుపెట్టి సంక్రాంతి పందేనికి రెడీ అయిపోయాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ మాస్ ప్రేక్షకులకు పసందుగా అనిపించింది. ఐతే ఈ తరహా సినిమాలు ఈ రోజుల్లో ఎంత మాత్రం ఆడతాయో అన్న సందేహాలు కొంత మేర ఉన్నాయి. కానీ ఈ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం ‘జై సింహా’పై మామూలు కాన్ఫిడెన్స్ తో లేడు. సంక్రాంతికి నందమూరి సింహం గర్జించడం గ్యారెంటీ అని ఆయన ధీమాగా చెబుతున్నాడు.
‘జై సింహా’ సినిమా చూసుకున్నాక కలిగిన నమ్మకంతో తాను సినిమాను ఎవరికీ అమ్మలేదని అంటున్నాడు సి.కళ్యాణ్. ఒక్క ఏరియా కూడా అమ్మకానికి పెట్టకుండా తానే అన్ని చోట్లా సొంతంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీన్ని బట్టే ఈ సినిమా మీద తానెంత ధీమాగా ఉన్నానో అర్థం చేసుకోవచ్చని చెప్పాడు. బాలయ్య సినిమా అంటే ఇట్టే సేల్ అయిపోతుందని.. ఎంతోమంది బయ్యర్లు ఎగబడతారని.. ఎంత రేటైనా పెట్టి సినిమా కొంటారని.. కానీ తాను మాత్రం ‘జై సింహా’ను అమ్మడానికి ఇష్టపడలేదని.. తానే డబ్బులు చేసుకోవాలనే కోరికతో సినిమాను తన వద్దే పెట్టుకున్నానని సి.కళ్యాణ్ అన్నాడు. ఈ సినిమా ద్వారా బాగా డబ్బులు సంపాదించి.. కొంతమేర బాలయ్య ఆధ్వర్యంలో నడిచే క్యాన్సర్ ఆసుపత్రికి ఇవ్వాలని భావిస్తున్నట్లు కళ్యాణ్ చెప్పడం విశేషం. మరి ఆయన నమ్మకాన్ని ‘జై సింహా’ ఏమేరకు నిలబెడుతుందో చూడాలి.