Begin typing your search above and press return to search.
యాడ్స్- ట్రైలర్స్ దొడ్డి దారి వ్యాపారమా?
By: Tupaki Desk | 1 July 2019 5:10 AM GMTతెలుగు సినిమా నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) లొల్లు గురించి తెలిసిందే. ఈ ఆదివారం నిర్మాతల మండలి కొత్త బాడీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా సి.కళ్యాణ్ ఎన్నికయ్యారు. తూతూ మంత్రంగా సాగిన కౌన్సిల్ ఎన్నికల్లో `మన కౌన్సిల్-మన ప్యానెల్` నెగ్గింది. అయితే ఈసారి 1200 మంది నిర్మాతల్లో ఎందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు? అసలు ఈ ఎన్నికలకు అథెంటిసిటీ ఉందా? అంటే పలువురు ఛాంబర్ పెద్దలే పెదవి విరిచేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
ఓవైపు 50 మందితో కూడిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంఘం ఈ ఎన్నికల్ని వెలివేసింది. అసలు ఇండస్ట్రీని నడిపించాల్సిన డీన్ లంతా ఎలక్షన్ అంటేనే దూరం దూరంగా ఉన్నారు. ఇందులో మెజారిటీ పార్ట్ నిర్మాతలెవరూ కనీసం పోలింగ్ బూత్ దగ్గరకు ఓటేసేందుకే రాకపోవడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే ఆర్.కె.గౌడ్ ప్యానెల్ పై ఈ ఎన్నికల్లో గెలిచిన అనంతరం కొత్త అధ్యక్షుడు సి.కల్యాణ్ మీడియా ముఖంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
``మా మీద ఈర్ష్యతోనే.. బాధతోనో.. కోపంతోనో లేక ఇంకేదైనా కారణం వల్లనో ఈరోజు ఓటింగ్‌కి కొందరు రాలేదు`` అలాంటి వారికి ధన్యవాదాలు అని అన్నారు. ఎలక్షన్స్ కి సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు.. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి వ్యవస్థను నిలబెట్టుకోవడానికి నేను ముందుంటానని సి.కళ్యాణ్ అన్నారు. వ్యవస్థ ఒకటిగా ఉండాలనేదే మా స్లోగన్. నిర్మాతల సంక్షేమ కార్యక్రమాలు జరగాలి.. అని వ్యాఖ్యానించారు. సినిమాల ట్రైలర్స్ కానీ.. వాణిజ్య ప్రకటనలు (యాడ్స్) కానీ.. ఏదైనా కానీ.. ఈ కౌన్సిల్ నుండే పంపాలని.. వేరే దొంగచాటు వ్యాపారం వద్దే వద్దని కళ్యాణ్ కోరారు. గిల్డ్ వాళ్లు కూడా ఈ ఆర్గనైజేషన్‌లో ఉండాలని కోరతాం. అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని వ్యాఖ్యానించారు.
తాజా వ్యాఖ్యలతో నిర్మాతల మండలి ఎన్నికలు తూతూగానే సాగాయని ఆయనే మీడియా ముఖంగా చెప్పినట్టయ్యింది. అసలు ఇంతకీ ఓటు వేసేందుకు రానిది ఎవరు? ఆయన గిల్డ్ నిర్మాతల పైనే ఇలా విరుచుకుపడ్డారా? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. ఇకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు విడిగా అసోసియేషన్ పెట్టుకుని యాడ్లు- ట్రైలర్లు అన్నీ తమ ఇష్టానికి ఇచ్చుకుంటామంటే కుదరదని సి.కళ్యాణ్ హుకుం జారీ చేయడం చూస్తుంటే .. ఇకపై గిల్డ్ నిర్మాతలతో సఖ్యత సాధ్యమేనా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. సినిమాలు తీసే నిర్మాతలంతా బయటికి వెళ్లిపోయాక.. సినిమాలు చాలా రేర్ గా.. నామ మాత్రంగా తీసే వాళ్లతో అసోసియేషన్ ఇప్పుడు ఎలా మనగలుగుతుంది? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక ప్రకటనలు- ట్రైలర్లు దొడ్డి దారి వ్యాపారంగా మారిందా? అన్న సందేహం పరిశ్రమ వర్గాల్లో ఉందిప్పుడు. వీటన్నిటికీ మునుముందు గిల్డ్ నిర్మాతలు సమాధానం చెబుతారేమో చూడాలి.