Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో కల్యాణ్ పోగొట్టుకున్న ‘చిల్లర’ ఎంత?
By: Tupaki Desk | 14 Dec 2015 7:30 AM GMTవివాదాస్పద వ్యక్తిగా చలనచిత్ర పరిశ్రమలో పేరున్న నిర్మాతల్లో ‘చిల్లర కల్యాణ్’ పేరు ముందుంటుంది. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మద్దెల చెర్వు సూరితో సంబంధాలు కావొచ్చు.. సూరిని చంపేసిన భానుతో అనుబంధం కావొచ్చు.. సి కల్యాణ్ మీద చాలానే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఓపెన్ గా విషయాలు షేర్ చేసుకుంటానంటూ..తాజాగా ఒక మీడియా సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. పరిశ్రమలో సంపాదించటంతో పాటు.. పోగొట్టుకున్నది కూడా బాగానే ఉంటుందని చెబుతారు. ఇంతకీ ఆయన ఇండస్ట్రీలో పోగొట్టుకున్నదెంత? అన్న విషయాన్ని తాజాగా ఆయన నోటి వెంట నుంచే వచ్చింది.
సినిమాలు తీసి నష్టపోయిన దాని కంటే కూడా.. తోటి నిర్మాతలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతోనే పోగొట్టుకుందని ఎక్కువని కల్యాణ్ చెప్పుకొచ్చారు. సినిమాలు ఆగిపోయే పరిస్థితుల్లో మంచి చేద్దామని చూసిన దానికే ఎక్కువ మూల్యం చెల్లించకోవాల్సి వచ్చిందన్నారు. ఈ ఇంటర్వ్యూ లో వందల కోట్ల రూపాయిల ఆస్తులు ఉన్న మీరు అన్న మాటను ఖండించని కల్యాణ్.. తాను సినిమాల కారణంగా తాను పోగొట్టుకున్నది రూ.30 కోట్లు అని ఆయనే స్వయంగా చెప్పారు.
సినిమాల ద్వారా పోగొట్టుకున్నది ఓ 50 ఉంటుందా? అంటే.. కాదు.. రూ.30కోట్లు అని చెప్పారు. సినిమాల్లో కోటిని రూపాయి అంటారని చెబుతారంటే.. తనకు అలాంటిది అవసరం లేదని.. ఓపెన్ గానే మాట్లాడేస్తానంటూ సూటిగా చెప్పేశారు కల్యాణ్. నిజమే.. వందల కోట్ల ఆస్తి ఉన్న వారికి రూ.30 కోట్లు చిల్లరే అవుతుందేమో కదూ..?