Begin typing your search above and press return to search.

సి.క‌ళ్యాణ్ ప్యానెల్ రెడీ.. అటువైపు?

By:  Tupaki Desk   |   21 Jun 2019 5:43 AM GMT
సి.క‌ళ్యాణ్ ప్యానెల్ రెడీ.. అటువైపు?
X
నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 30న జ‌రిగే ఎన్నిక‌ల గురించి టాలీవుడ్ లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఈసారి ఎవ‌రెవ‌రు పోటీ ప‌డ‌తారు. ఎల్.ఎల్.పి పెట్టుకుని బ‌య‌ట‌కు వెళ్లి నిర్మాత‌ల గిల్డ్ గా మారిన వాళ్లంతా తిరిగి మండ‌లిలో క‌లుస్తారా.. క‌ల‌వ‌రా? అంటూ వేడెక్కే చ‌ర్చ సాగుతోంది.

అయితే ఎవ‌రు వ‌చ్చినా రాక‌పోయినా తాము మాత్రం ఎన్నిక‌లు నిర్వ‌హించి తీర‌తామ‌ని సి.క‌ళ్యాణ్ బృందం పెద్ద‌రికం నెరుపుతోంది. ఎల్.ఎల్.పి కం నిర్మాత‌ల గిల్డ్ పెద్ద‌ల్ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తాం. వారినే సార‌థులుగా ఉండ‌మ‌ని కోర‌తాం. ఎల‌క్ష‌న్ బాధ్య‌తల్ని వారికే అప్ప‌గించి మేం సాయానికి ఉంటామ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ గిల్డ్ మెంబ‌ర్స్ ఎవ‌రూ సి.క‌ళ్యాణ్ బృందం పిలుపున‌కు స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. మంత‌నాలు స‌ఫ‌లం కాలేద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఒక ప్యానెల్ వివ‌రాలు రివీల‌య్యాయి. ఈసారి సి.క‌ళ్యాణ్ ప్యానెల్ పోటీ బ‌రిలో ఉంది. సి.క‌ళ్యాణ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతుండ‌గా ఈ ప్యానెల్ త‌ర‌పున‌ వై.వి.య‌స్ చౌద‌రి.. కె.అశోక్ కుమార్ ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు. అలాగే టి.ప్ర‌స‌న్న కుమార్ - మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వుల‌కు పోటీ చేస్తున్నారు. సి.ఎన్.రావు - జె.వి.మోహ‌న్ గౌడ్ సంయుక్త కార్య‌ద‌ర్శులుగా.. చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు ట్రెజ‌ర‌ర్ గా పోటీ చేస్తున్నారు. ఇక ఈ ప్యానెల్ త‌ర‌పున ప‌ద్మాల‌యా జీవీ న‌ర‌సింహారావు- సి.ఎస్.ఆర్కే ప్ర‌సాద్‌- కె.అమ్మిరాజు- బండ్ల గ‌ణేష్- శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్- టి.రామ‌స‌త్య‌నారాయ‌ణ‌- పి.సునీల్ కుమార్ రెడ్డి -వ‌జ్జా శ్రీ‌నివాస‌రావు- ప‌ల్లి కేశ‌వ‌రావు-వీర‌మాచినేని రామ‌కృష్ణ‌(ఆర్కే)- ఎస్.కె.న‌యీమ్ అహ్మద్- వై సురేంద‌ర్ రెడ్డి-వి సాగ‌ర్-ఆచంట గోపినాథ్-వ‌ల్ల‌భ‌నేని అశోక్ .. ఎగ్జిక్యూటివ్ స‌భ్యులుగా పోటీ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఒక ప్యానెల్ కి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలిశాయి. ఇక‌పోతే ఈ ప్యానెల్ తో పోటీ ప‌డే ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ ఎవ‌రు? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇంత‌కీ నిర్మాత‌ల గిల్డ్ బ‌రిలో దిగుతుందా.. లేదా? అన్న‌ది స‌స్పెన్స్. వీళ్లు వాళ్ల‌తో క‌లుస్తారా లేదా? అన్న‌ది సందేహ‌మేన‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే వేరొక ప్యానెల్ సి.క‌ళ్యాణ్ ప్యానెల్ తో పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుంది. లేదూ చ‌ర్చ‌ల రూపంలో ఒక క‌మిటీని ఏక‌గ్రీవం చేస్తారా? అన్న‌ది చూడాలి.