Begin typing your search above and press return to search.
వరుణ్‌తేజ్‌ని ''సుప్రీమ్'' చేసేశారు
By: Tupaki Desk | 8 July 2015 3:52 PM GMTమెగా హీరోలందరికీ బిరుదులున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో బిరుదు. అయితే వాటన్నిటికీ తాము యాప్ట్ అని నిరూపించుకుకునేందుకు చాలా శ్రమిస్తున్నారంతా.
మెగాస్టార్ చిరంజీవికి ఆ బిరుదు రాకముందే సుప్రీం హీరో, డ్యాషింగ్ హీరో అనే బిరుదులుండేవి. అయితే చిరుకి 'ఛాలెంజ్' టైమ్‌లో ఆ చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు సుప్రీంహీరో అని బిరుదిచ్చి ఎంకరేజ్ చేశారు. చిరులోని డైనమిజం నచ్చడం వల్ల దానినే ఆ తర్వాత కొనసాగించారు. డెడికేషన్, హార్డ్‌వర్క్, హీరో అన్న పదానికి మీనింగ్ చెప్పిన హీరో అవ్వడం వల్లే చిరు గొప్పగా వెలిగిపోయారు. అతడి వర్కింగ్ స్టయిల్ వల్ల చిరుకి అలా బిరుదు ఇవ్వడం పట్ల అభిమానులు కూడా సంతోషించేవారు. కానీ కాలక్రమంలో ఇలాంటి బిరుదులు అందరికీ వచ్చేశాయి.
మెగా ఫ్యామిలీలో అరడజను పైగానే హీరోలు పుట్టుకొచ్చారు. పవన్ కల్యాణ్ తనదైన ఇండివిడ్యువాలిటీ, డైనమిజంతో పవర్‌స్టార్‌గా వెలిగిపోయాడు. బిరుదులు, పొగడ్తలు ఇష్టం లేని హీరోగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చిరు నటవారసునిగా చరణ్ ఆరంగేట్రం చేయగానే 'చిరుత', మెగా పవర్‌స్టార్ అంటూ బిరుదులిచ్చేశారు. బన్నికి స్టయిలిష్ స్టార్ అన్న బిరుదిచ్చారు. దాన్ని సార్థకం చేస్తూ స్టయిల్ ఐకన్‌గా నిరూపించుకున్నాడు బన్ని. ఆ తర్వాత సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, శిరీష్ రంగంలోకి దిగారు. సాయిధరమ్‌ని మెగా ఎనర్జిటిక్ స్టార్ అనేస్తున్నారు.
లేటెస్టుగా పూరీతో సినిమా ఓపెనింగులో వరుణ్‌తేజ్‌ని ఏకంగా 'సుప్రీంహీరో' అంటూ పొగిడేశాడు నిర్మాత సి.కళ్యాణ్. శిరీష్‌కి ఇంకా బిరుదు ఇవ్వలేదు కానీ ఏదో ఒక బిరుదుని సిద్ధం చేసే ఉంటారు. అయితే ఇదంతా అభిమానులు తమ అభిమానంతో చేసేది మాత్రమే. హీరోలు కావాలని అలా పిలుపించుకోవడానికి ఉబలాట పడరు. ఒకటి రెండు సినిమాలకే ఇలాంటి బిరుదుల అంత యాప్ట్‌గా ఉండవేమో మారాజా!!