Begin typing your search above and press return to search.
ఈ ట్రైలర్ చూశాక ఐఫోన్ 11 ప్రో కొనేస్తారు!
By: Tupaki Desk | 26 Aug 2020 11:30 AM GMTఐఫోన్ లో ప్రయోగం చేశారు. షాట్ ఆన్ ఐఫోన్ చిత్రం అంటూ ప్రచారం సాగించారు. టెక్నాలజీతో ప్రయోగం అంటూ హీటెక్కిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న ఈ మూవీ సంగతులు ఆసక్తికరం. ఇందులో ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ నటించడంతో ఐఫోన్ మేకింగ్ కి ప్రచారం పరంగా గొప్ప మైలేజ్ దక్కుతోంది.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో జస్ట్ ట్రైలర్ వదిలారు. త్వరలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టైటిల్ `సి యు సూన్`. ట్రైలర్ తోనే మ్యాటర్ ఎంతో అర్థమైపోతోంది. ఐఫోన్ అయినా స్పష్ఠమైన విజువల్స్ తో వండర్ ఫుల్ క్వాలిటీతో ఆకట్టుకుంటోంది. మహేష్ నారాయణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూట్యూబ్ లో రిలీజైన 24 గంటల వ్యవధిలో దాదాపు 2.5 మిలియన్ల వీక్షణలతో ట్రెండ్ సెట్ చేసింది ట్రైలర్.
ఇంతకీ ఈ సినిమా కథాంశం ఏమిటి? అంటే.. కాల్ సెంటర్ ఉద్యోగి (రోషన్ మాథ్యూ) విదేశాలలో ఉండి స్వదేశంలోని తనవారితో మాట్లాడుంటారు. వారు ప్రతిరోజూ వీడియో కాల్స్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునే క్రమంలో అకస్మాత్తుగా వైఫ్ ఇంటి నుండి తప్పిపోతుంది. దీంతో విదేశాల్లోని తన స్నేహితుడి సాయం తీసుకుని దానిని ఎలా సాల్వ్ చేశాడు? అన్నది ఆసక్తికరం. వీడియో చాట్ .. ఇంటర్ ఫేస్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునే పాత్రల్ని ఉపయోగించి.. తక్కువ బడ్జెట్ లో ఈ మూవీని తెరకెక్కించారు.గోపి సుందర్ చక్కని నేపథ్య సంగీతం అందించారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్. ఫోన్ లో తీసినా కథ కథనం పరంగా ఎంతో జాగ్రత్త తీసుకోవడం వల్లనే అంత గ్రిప్పింగ్ గా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత ఐఫోన్ 11 ప్రో కొనాలనుకుంటే అంతకుముందే ఫిలింమేకింగ్ లో రకరకాల యాస్పెక్ట్స్ పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్.