Begin typing your search above and press return to search.
చరణ్ - కొరటాల శివ భయపడ్డారట
By: Tupaki Desk | 22 April 2022 1:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన చిత్రం `ట్రిపుల్ ఆర్` ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. `కేజీఎఫ్ 2` రిలీజ్ వరకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1084 కోట్లు వసూళ్లని రాబట్టింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా 880.4 కోట్లు అన్ని భాషల్లో కలిపి వసూళ్లని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఇప్పటికే పలు రికార్డుల్ని తిరగరాసిన ఈ మూవీ ఇటీవల `కేజీఎఫ్ 2` రిలీజ్ తరువాత కాస్త వెనకబడింది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆచార్య` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా పవర్ స్టార్ కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ముందు చరణ్ పాత్ర నిడివిని 45 నిమిషాలు అనుకున్నారని, అయితే నిడివి మరీ ఎక్కువ కావడంతో ఫైనల్ గా 25 నిమిషాలకు చరణ్ పాత్రని కుదించారని వార్తలు వినిపిస్తున్నాయి.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఓవర్సీస్ లో నూ భారీగా విడుదల చేస్తున్నారట. మూవీ రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఇటీవల `ట్రిపుల్ ఆర్` ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొన్న రామ్ చరణ్ అదే తరహాలో `ఆచార్య` కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజాగా కొరటాల శివతో కలిసి చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పిన రామ్ చరణ్ `ట్రిపుల్ ఆర్` షూటింగ్ చేస్తున్న సమయంలోనే `ఆచార్య` చిత్రీకరణ లో పాల్గొన్నారట. ఇది ఎలా సాధ్యమైందని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పారు. `ట్రిపుల్ ఆర్` షూటింగ్ లో వున్నప్పుడే `ఆచార్య` షూటింగ్ లో పాల్గొన్నాను. మమూలుగా రాజమౌళి తన సినిమా పూర్తయ్యే వరకు హీరోలని బయటి ప్రాజెక్ట్ లకు అనుమతించడు. అలాంటప్పుడు నేను రెండు చిత్రాల్లో ఎలా నటించాననే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ కలిగిందన్నారు చరణ్.
`ఆచార్య`లో సిద్దా పాత్రలో నటించాలని అనుకున్నప్పుడు నేను, కొరటాల శివ ఈ విషయమై రాజమౌళిని సంప్రదించడానికి భయపడ్డాం. దీంతో తమకు సహాయం చేయమని ఆ భారాన్ని చిరంజీవిగారికి అప్పగించాం. ఆయన వెళ్లి రాజమౌళిని కలిసి `ఆచార్య` కోసం చరణ్ డేట్స్ ఇవ్వమని ఒప్పించారు. నాన్న, నేను ఇద్దరం కలిసి ఒకే తెరపై కనిపించాలన్నది అమ్మ కోరిక. తన కోరిక బలమైనది కాబట్టే ఇది కుదిరింది. జక్కన్న ఓకే చేసి డేట్స్ కేటాయించారు` అని చెప్పుకొచ్చారు చరణ్.