Begin typing your search above and press return to search.
క్యాలెండర్ గాల్స్ ఇన్ని కష్టాలెందుకో ?
By: Tupaki Desk | 29 Sep 2015 5:40 AM GMTఐదుగురు అందమైన భామలతో విచ్చలవిడిగా, హద్దులు చెరిపేస్తూ అందాలు ఒలకబోయించారు క్యాలెండర్ గాల్స్ మూవీలో. కానీ రిజల్ట్ మాత్రం చాలా భీకరంగా ఉంది. 11వందల థియేటర్లలో రిలీజ్ చేసిన ఈ మూవీ.. తొలి వీకెండ్ లో సాధించిన మొత్తం కేవలం ఐదంటే ఐదు కోట్లు. ఇంతకంటే ఘోరమైన రివ్యూలు ఉన్న కిస్ కిస్కో ప్యార్ కరూ కి కూడా.. ఇంతకంటే బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా ఏ క్లాస్ సెంటర్లలో అయినా అంతో ఇంతో కలెక్షన్స్ ఉంటున్నాయి కానీ.. బీ, సీ సెంటర్లలో ఈ గాల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాస్తవానికి మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఫ్యాషన్ కంటే బెటర్ కంటెంట్ అనే అన్నారు అందరూ. స్టోరీ పరంగా మంచి కాన్సెప్ట్ నే ఎంచుకున్నారు. ఐదుగురు అమ్మాయిలయిన అవని మోదీ, ఆకాంక్ష పూరి - కైరా దత్ - రుహి సింగ్ - సతపుర పైన్ లు.. ఈ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో, ఎన్నెన్ని సర్జరీలు చేయించుకున్నారో అంటూ.. కొన్ని వాస్తవ కథల ఆధారంగా రాసుకున్న ఇన్ స్పిరేషనల్ స్టోరీ ఇది.
కానీ తాము తెరపై చూసే అందాల వెనక ఉన్న ఇన్ని కథలను జీర్ణించుకోవడం.. బీ, సీ సెంటర్ ప్రేక్షకుల వల్ల కాలేదంటున్నారు క్రిటిక్స్. దీంతో ఐదుగురు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్లే.