Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల బంద్ కి పిలుపు..ఇందులో నిజ‌మెంత‌?

By:  Tupaki Desk   |   26 Jun 2022 5:30 AM GMT
థియేట‌ర్ల బంద్ కి పిలుపు..ఇందులో నిజ‌మెంత‌?
X
ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ టిక్కెట్ అమ్మ‌కాల ఎంఓయూపై ఫిలింఛాబ‌ర్-ప్ర‌భుత్వం మ‌ధ్య పొంత‌న కుద‌ర‌ని సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొత్త‌గా వ‌చ్చిన జీవోపై వెసులుబాటు క‌ల్పించాల‌ని చాంబ‌ర్ ప్ర‌భ‌త్వానికి విజ్ఞ‌ప్తి చేసింది. కానీ ఇంత వ‌ర‌కూ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి బ‌ధులు రాలేదు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ బంద్ కి రంగం సిద్దం అవుతుందా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది.

ఎగ్జిబిట‌ర్లు ఇప్ప‌టికే స‌మావేశం నిర్వ‌హించుకుని త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌కి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు లీకులందుతున్నాయి. ఇట‌లీవ‌లే తూర్పు గోదావ‌రి జిల్లా ఎగ్జిబిట‌ర్లు అమ‌లాపురంలో స‌మావేశం నిర్వ‌హించుకుని చ‌ట్ట‌బ‌ద్ధంగా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌ని ప‌క్షంలో థియేట‌ర్లు బంద్ పెట్టాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. త‌మ‌తో పాటు స్వ‌చ్ఛందంగా మిగ‌తా ప్రాంతాల ఎగ్జిబిట‌ర్లు అంతా కూడా ముందుకు రావాల‌ని పిలిపునిచ్చిన‌ట్లు స‌మాచారం.

మ‌రి ఎందుకిలా ఎగ్జిబిట‌ర్లు ఈ విష‌యాన్ని అంత సీరియ‌స్ గా తీసుకుంటున్న‌ట్లు అంటే? ఆస‌క్తిక‌ర సంగ‌తులే వెలుగులోకి వ‌స్తున్నాయి. టిక్కెట్ ధ‌ర ఎంత ఉన్నా ప్రేక్ష‌కుడికి తెలియ‌కుండానే 10 రూపాయ‌లు అద‌నంగా ఎగ్జిబిట‌ర్లు వ‌సూల్ చేస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్ ఛార్జ్ పేరిట అక్క‌డా భారీగా వ‌సూల్ చేస్తూ అందులోనూ ఎగ్జిబిట‌ర్లు వాటా తీసుకుంటున్నారు.

అలాగే థియేట‌ర్ రిన్నోవేషిన్ పేరిట భారీగా వ‌డ్డీ లేని రుణాలు అందుకుంటున్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్మితే ఆ లాభాలు మొత్తం ఎగ్జిబిట‌ర్లు కోల్పోవాల్సి ఉంటుంది. కేవలం టిక్కెట్ పై నిక్క‌చ్చిగా వ‌చ్చే దాయం మిన‌హా ఇత‌ర లాభాలు ఏమీ ఉండ‌వు. ఆ మ‌ధ్య తెలంగాణ‌లో బుక్ మై షో ఇలాంటి ధోరణి విధానంతోనే అద‌నంగా ఛార్జ్ చేస్తుంద‌ని ఎగ్జిబిట‌ర్లు అంతా శ‌మ‌ర శంఖం పూరించిన సంగ‌తి తెలిసిందే.

చివ‌రికి నిర్మాత దిల్ రాజు ఎంట‌ర్ అయి ఆ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం చూపించారు. మ‌రి ఏపీలో థియేట‌ర్లు బంద్ చేస్తే? అప్ప‌డు ప‌రిశ్ర‌మ పెద్ద‌లు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే టిక్కెట్ ధ‌ర‌లు పెంచ‌డంతో ప్రేక్ష‌కుడికి సినిమా దూర‌మైంది. స్టార్ హీరో సినిమా సైతం జ‌నాలు లేక థియేట‌ర్లు వెల‌వెల‌బోతున్నాయి. ఆ స‌మస్య‌ని ఎలా ప‌రిష్క‌రించాల‌ని పెద్ద‌లు క‌స‌రత్తులు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు.

తాజాగా ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్లు బంద్ కి సిద్ద‌మైతే రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోతాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం అంత వీజీగా క‌ల్పించుకునే ఛాన్స్ లేద‌ని ఎన‌లిస్ట్ లు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో దిగొచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌ద్దు వ‌ద్దు అంటూనే టిక్కెట్ రేట్లు పెంచి పెద్ద‌లు ఘోరంగా దెబ్బ‌తిన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌భుత్వం ముందుకు పెద్ద‌లు వెళ్ల‌డం అంటే అంత వీజీ కాదు. చాలా విష‌యాలు ఆలోచించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.