Begin typing your search above and press return to search.
మహేష్ మావయ్య కహాని
By: Tupaki Desk | 19 May 2019 6:09 AM GMTబెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఆవిడ దర్శనం చేసుకున్నాక జరిగిన మహర్షి సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తమ హీరో ఎన్నడూ లేనిది ఇలా పదే పదే పబ్లిక్ లోకి వచ్చి విజయానుభూతిని పంచుకోవడం పట్ల వాళ్ళ ఆనందం మాములుగా లేదు. ఈ సందర్భంగా జరిగిన మహేష్ రాఘవేంద్ర రావుల సంభాషణ ఆకట్టుకుంది.
ముందు మాట్లాడిన రాఘవేంద్ర రావు గారు మహేష్ తనను రాజకుమారుడు షూటింగ్ టైంలో మావయ్య అని పిలిచేవాడని ఇప్పుడు ఈ స్టేజి మీద అలాగే పిలిపించుకోవాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టారు. దీనికి బదులుగా మహేష్ తన స్పీచ్ లో రాఘవేంద్ర రావు గారిని మావయ్య అని పిలుస్తూ తన మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన సలహాలు నటన పరంగా తీర్చిదిద్దిన తీరుని గుర్తు చేసుకున్నాడు
రాజకుమారుడు మహేష్ కు పర్ఫెక్ట్ డెబ్యూ మూవీగా నిలిచిపోయింది. ముందు మహేష్ కు దాని కాన్సెప్ట్ థీమ్ అర్థం కాలేదట. రాఘవేంద్ర రావు గారి మీద నమ్మకంతో చేసేశాడట. అదే నిలబడింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఫస్ట్ మూవీతోనే ప్రిన్స్ అంటే ఏంటో ప్రేక్షకులకు తెలిసింది.
అక్కడ మొదలైన పరుగు మహర్షి దాక పాతిక సినిమాల ప్రస్థానంగా కొనసాగుతూనే ఉంది. ఎందరితో చేసిన మొదటి సినిమా దర్శకులు హీరోలకు ఎప్పుడూ ప్రత్యేకమే. అందులోనూ ఇలాంటి అకేషన్ వచ్చినప్పుడు అందరితో పంచుకుంటే దాని వల్ల కలిగే అనుభూతే వేరు. అది మహేష్ రాఘవేంద్ర రావులు పూర్తిగా ఆస్వాదించారు